ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్! జాలరి దశ తిరిగిపోయింది
కృష్ణా నదికి వరద కొనసాగుతుండడంతో పరివాహక గ్రామాల్లో చేపల పట్టడం జోరందుకుంది. ఈ క్రమంలోనే ఉండవెల్లి మండల పరిధిలోని మారమునగాల గ్రామ శివారులోని కృష్ణానదిలో చేపలు పట్టేందుకు జాలరులు పెద్ద ఎత్తున వెళ్ళారు. అందులో వెంకట్రాముడుకు వీకెండ్ లో ఊహించని అనుభవం ఎదురైంది. మారమునగాల గ్రామ శివారులోని కృష్ణానదిలో జాలరి వెంకట్రాముడు.. వరద ఉన్నన్ని రోజులు చేపలు పడుతుంటాడు.
యథావిధిగా శనివారం ఉదయం నదిలో వల విసిరాడు. కొద్ది సేపటికి వలను వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఎంతకీ వల రాకపోయేసరికి.. చాలా బరువుగా అనిపించడంతో.. పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించాడు. అతికష్టం మీద వలను బయటకు లాగుతుండగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. భారీ చేప వలకు చిక్కడంతో వెంకట్రాముడు షాక్ అయ్యాడు. వెంటనే మరింత బలంగా వలను బయటకు లాగాడు. సాధారణంగా పడే చిన్న చేపలతో పాటు ఓ భారీ చేప వలకు చిక్కింది. వెంటనే ఆ చేపను వల నుంచి బయటకు తీసి చూడగా.. చేప బొచ్చగా నిర్ధారించారు. ఇక భారీ చేప వలకు చిక్కడంతో మిగతా జాలర్లు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. తూకం వేయగా 20కిలోల పైగానే బరువు ఉంది. భారీ చేప పడిందని ఆనందించాలో.. ఆ చేపను ఎలా అమ్మాలి.. ఎవరు కొంటారని జాలరి వెంకట్రాముడు కొంత ఆందోళనకు గురయ్యాడు. కానీ భారీ చేప పడిందని విషయం తెలుసుకున్న ఎనిమిది మంది మానోపాడు గ్రామస్తులు కిలో 280 రూపాయల చొప్పున 5 వేల 600 రూపాయల మొత్తం చెల్లించి, చేపను కొనుగోలు చేశారు. ఇంత భారీ చేప చిక్కడం… ఒక్క చేపకే పెద్దమొత్తంలో నగదు రావడంతో జాలరి వెంకట్రాముడు సంతోషంలో మునిగిపోయాడు. వీకెండ్ లో భారీ బొనంజా కొట్టావని తోటి జాలరులు వెంకట్రాముడుని మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

