AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట.. అదృష్టానికి తలుపు తరచినట్లే..

న్నిసార్లు కలలో జంతువులను చూడటం చాలా శుభప్రదమని చెబుతారు. ఆవు వంటి వివిధ రకాల జంతువులను కలలో చూడడం గురించి వాటికి అర్ధాల గురించి స్వప్న శాస్త్రంలో పేర్కొంది. జంతువులు మీ కలలో పదేపదే కనిపిస్తే అది మీ అదృష్టాన్ని, లేదా దురదృష్టాన్ని మారుస్తుందని అర్ధం. ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం..

Swapna Shastra: మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట.. అదృష్టానికి తలుపు తరచినట్లే..
Animals In Dreams
Surya Kala
|

Updated on: Aug 08, 2024 | 9:30 AM

Share

నిద్రలో ప్రతి ఒక్కరూ కలలు కనడం సర్వ సాధారణం. కలలో రకరాకాల విషయాలను చూస్తారు. జంతువులు, పక్షులు, వృక్షాలు వంటి వాటిని చూస్తారు. అయితే ఇలా కొన్నిసార్లు కలలో జంతువులను చూడటం చాలా శుభప్రదమని చెబుతారు. ఆవు వంటి వివిధ రకాల జంతువులను కలలో చూడడం గురించి వాటికి అర్ధాల గురించి స్వప్న శాస్త్రంలో పేర్కొంది. జంతువులు మీ కలలో పదేపదే కనిపిస్తే అది మీ అదృష్టాన్ని, లేదా దురదృష్టాన్ని మారుస్తుందని అర్ధం. ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం..

  1. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా ఆవు కనిపిస్తే అది అదృష్టమని చెబుతారు. హిందూ మతంలో గోవుకు విశిష్ట స్థానం ఉంది. కనుక ఆవును కలలో చూడటం శుభసూచకమని చెబుతారు. కలలో ఆవు కనిపిస్తే ఆ వ్యక్తిపై దేవుడు ఆశీసులు ఉన్నాయని అర్థం. రాబోయే రోజుల్లో వీరు చేయనున్న అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారని ఆవు కలకు అర్ధం అట.
  2. అదే విధంగా ఎవరి కలలో నైనా ఏనుగు కనిపిస్తే అతనికి మంచి రోజులు రానున్నాయని అర్థం. ఈ కల వ్యక్తికి సంపద పెరుగుతుందని సూచిస్తుంది. త్వరలో అతని జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందుతారు.
  3. అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపిస్తే అది శుభసూచకమని చెబుతారు. కలలో నల్ల పాము కనిపిస్తే అది అదృష్టానికి ముందు సూచిక అని అర్థం. రానున్న కాలంలో కీర్తి మరింతగా పెరుగుతుందని.. ఈ కల ప్రకారం ప్రతి కోరిక నెరవేరుతుందనడానికి సంకేతమని స్వప్న శాస్త్రంలో పేర్కొంది.
  4. ఎవరి కలలోనైనా గుడ్లగూబను చూస్తే జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం. కలలో గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని కలల శాస్త్రం చెబుతోంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అంతేకాదు, కలలో తెల్లటి సింహం కనిపించడం శుభప్రదం అని చెబుతారు. కలలో తెల్ల సింహం కనిపిస్తే భవిష్యత్తులో మీరు పురోగతిని పొందుతారని అర్థం. అంతేకాదు కుటుంబ, సామాజిక జీవితంలో విజయం సాధిస్తారని మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరిస్తారని అర్ధం. ప్రమాదాలు ఎదురైనప్పుడు పోరాడుతారని కలల శాస్త్రం చెబుతోంది.
  7. ఎవరి కలలో నైనా కుందేలును చూసినట్లయితే మంచి సంకేతం. అంటే వీరి జీవితంలో ప్రేమ పెరుగుతుంది. చేపట్టిన ప్రతిదానిలో విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు