Tirumala Temple: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం..
Tirumala Temple: తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది.
Tirumala Temple: తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మంగళవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.26 కోట్లు వచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. కాగా, నిన్న ఒక్క రోజు 32,816 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అలాగే 14,459 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి తీసుకువస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించి.. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ తర్వాత నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇకపోతే.. పుష్పయాగ మహోత్సవం కారణంగా వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది.
Also read:
Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్త వింటారు.. బుధవారం రాశి ఫలాలు..
Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూంలో జెస్సీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్..
Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..