AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Water: మీ ఇంట్లో పవిత్రమైన గంగా జలం ఉన్నట్లయితే.? ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు.!

సనాతన సంప్రదాయంలో గంగా జలం ఎంతో పవిత్రమైనది. దీనిని హిందువులు అమృతంగా భావిస్తారు. గంగా నదిలో స్నానం చేయడం...

Ganga Water: మీ ఇంట్లో పవిత్రమైన గంగా జలం ఉన్నట్లయితే.? ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు.!
Gangajal
Ravi Kiran
|

Updated on: Nov 09, 2021 | 6:11 PM

Share

సనాతన సంప్రదాయంలో గంగా జలం ఎంతో పవిత్రమైనది. దీనిని హిందువులు అమృతంగా భావిస్తారు. గంగా నదిలో స్నానం చేయడం ద్వారా జీవితంలోని అన్ని పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. గంగలో స్నానం, పూజించడం, ఆచమనం చేయడం ద్వారా అనేక కష్టాలు తొలగిపోతాయని వారి భావన. అందుకే గంగా నదిలో స్నానం ఆచరించిన ప్రతీ భక్తుడు.. ఆ నీటిని తమతో పాటు తీసుకెళ్తారు. అయితే ఈ దివ్య గంగా జలానికి సంబంధించిన ముఖ్య విషయాలు మాత్రం తెలుసుకోవడం మర్చిపోవద్దు.

* గంగాజలాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బా లేదా సీసాలో ఉంచకూడదు. పూజకు ప్లాస్టిక్ వాడకాన్ని అపవిత్రంగా పరిగణిస్తారు. గంగాజలాన్ని ఎల్లప్పుడూ లోహంతో చేసిన పాత్రల్లో పెట్టాలి.

* సనాతన సంప్రదాయంలో గంగాజలం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందువల్ల గంగాజలం ఎప్పుడూ కూడా పవిత్రమైన స్థలంలోనే ఉండాలి. దానిని మురికి చేతులతో ఎప్పుడూ తాకొద్దు. గంగాజలాన్ని ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్యంలో లేదా పూజగది దగ్గర ఉంచాలి.

*కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు పవిత్ర తేదీ లేదా తీజ్ పండుగ రోజున గంగా నదిలో స్నానం చేయలేకపోతే, గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలిపి పూర్తి భక్తితో స్నానం ఆచరించవచ్చు. తద్వారా మీకు పుణ్యం దక్కుతుంది.

* మీ ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఏదీ కూడా ఉండకూడదంటే.. గంగాజలాన్ని ఇంటి నలుమూలల చిలకరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వ్యాపించడంతో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది.

* గంగా జలం లేకుండా శివుని ఆరాధన అసంపూర్తి అని పండితులు అంటారు. కాబట్టి మీ కోరిక నేరవేరాలన్నా.. మహాదేవుని ఆరాధన పూర్తి కావాలన్నా.. శివలింగంపై గంగాజలాన్ని చిలకరించడం మర్చిపోవద్దు.

* మీరు అప్పులతో బాధపడుతుంటే.. వాటిని పూర్తి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి తీరకపోతే.. మీరు గంగా జలాన్ని ఇత్తడి పాత్రలో నింపి దాన్ని ఇంటికి ఉత్తరం వైపు ఓ పవిత్ర స్థలంలో ఉంచితే.. మీ జీవితంలో ఉన్న అతిపెద్ద రుణం తీరిపోతుంది. ఇదే విషయాన్ని చాలామంది నమ్ముతారు.

Also Read:

Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!

Fruits Side Effects: ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..