Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేయడానికే కాదు.. ఈ రోజు విశేషం ఏమిటో తెలుసా..

వాస్తవానికి అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల పూజతో పాటు కొన్ని చర్యలు చేయవచ్చు. నిరుపేదలకు, బ్రాహ్మణాలకు స్వయం పాకం ఇవ్వండి. అంతేకాదు అసలు అక్షయ తృతీయకు పురాణాల ప్రకారం విశేషం ఏమిటో తెలుసుకుందాం.. 

Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే బంగారం కొనుగోలు చేయడానికే కాదు.. ఈ రోజు విశేషం ఏమిటో తెలుసా..
Akshaya Tritiya
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 1:49 PM

హిందూ సంప్రదాయంలో అనేక పండగలు, పర్వదినాలు. సీజనల్ కి అనుగుణంగా పండగలను జరుపుకుంటారు. వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఈ సంవత్సరం ఈ తేదీ శనివారం, 22 ఏప్రిల్ 2023న వస్తుంది.  ఈ ప్రత్యేక మైన రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. ఈ రోజున నియమ నిబంధనల ప్రకారం పూజించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అయితే ప్రస్తుతం అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనే విశ్వసిస్తారు. వాస్తవానికి అక్షయ తృతీయ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల పూజతో పాటు కొన్ని చర్యలు చేయవచ్చు. నిరుపేదలకు, బ్రాహ్మణాలకు స్వయం పాకం ఇవ్వండి. అంతేకాదు అసలు అక్షయ తృతీయకు పురాణాల ప్రకారం విశేషం ఏమిటో తెలుసుకుందాం..

  1. అక్షయ తృతీయ పరశురాముడు జన్మించిన రోజు.
  2. భగీరథుడు తపస్సుతో పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం అక్షయ తృతీయ
  3. శ్రీరాముడు జన్మించిన యుగం.. త్రేతాయుగం మొదలైన పర్వదినం అక్షయ తృతీయ
  4. అక్షయ తృతీయ శ్రీ కృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
  5. ఇవి కూడా చదవండి
  6. పంచమ వేదం మహాభారతం వ్యాస మహర్షి మహా భారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన పర్వదినం అక్షయ తృతీయ
  7. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో సూర్య భగవానుడు పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం అక్షయ తృతీయ.
  8. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం అక్షయ తృతీయ
  9. సమద్గురు ఆది శంకరాచార్యుడు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం అక్షయ తృతీయ.
  10. పార్వతి దేవి.. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం అక్షయ తృతీయ.
  11. ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు అక్షయ తృతీయ

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)