Aja Ekadashi: అజ ఏకాదశి విశిష్టత.. ఉపవాసం, పూజ విధానం, శుభ సమయం ఎప్పుడంటే..
శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి అజ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఏకాదశి వ్రతం వలన అన్ని రకాల శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించిన వ్యక్తి సుఖ సంతోషాలను పొందుతాడని, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుండి విముక్తి పొందుతాడని నమ్మకం.

హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలోని ఒకొక్క తిధికి ఒకొక్క ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో 26 ఏకాదశుల.. ఈ ఏకాదశి నామాలను వింటే చాలా పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే ఈ ఏకాదశుల్లో అజ ఏకాదశి అని లేదా అన్నద ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును పూజిస్తే అతని కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో వచ్చిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. పురాణాల్లో ఏకాదశి వ్రతం, ఉపవాసం గొప్పదని పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉపవాస దీక్ష తీసుకుని శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వలన ఆనందం కలుగుతుందని.. అదృష్టాన్ని పెంచుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం.
శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి అజ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఏకాదశి వ్రతం వలన అన్ని రకాల శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించిన వ్యక్తి సుఖ సంతోషాలను పొందుతాడని, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుండి విముక్తి పొందుతాడని నమ్మకం.
అజ ఏకాదశి శుభ సమయం
హిందూ మతంలో అజ ఏకాదశిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పవిత్ర తేదీ ఆదివారం, సెప్టెంబర్ 10, 2023 తేదీన అజ ఏకాదశి వచ్చింది. అజ ఏకాదశి శుభ సమయం సెప్టెంబరు 9వ తేదీ రాత్రి 9.17 గంటలకు ఏకాదశి రోజున ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి 9.28 గంటలకు ముగుస్తుంది. అజ ఏకాదశి వ్రతం 10 సెప్టెంబర్ 2023న పాటించబడుతుంది.




ఉపవాస సమయం
- అజ ఏకాదశి వ్రతాన్నిసెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6.04 నుండి 8.33 వరకు ఆచరించవచ్చు. ద్వాదశి తిథి రాత్రి 11:52 గంటలకు ముగుస్తుంది. కనుక ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి ఉపవాసం దీక్ష చేపట్టాలి.
- సరైన పూజా విధానం
- అజ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండేవారు ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- రోజూ పని చేసిన తర్వాత స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి.
- పసుపు రంగు విష్ణువుకు చాలా ప్రీతికరమైనదని నమ్మకం. కనుక ఈ రోజున పసుపు బట్టలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
- దీని తరువాత సూర్య భగవానుడికి నేటితో అర్ఘ్యన్ని సమర్పించి, నీటిని సమర్పించిన తర్వాత విష్ణువును పూజించండి.
- ముందుగా పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ నారాయణుని విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని తరువాత విష్ణువును పసుపు రంగు పుష్పాలు, పండ్లు, ధూపం, దీపాలతో పూజించండి.
- అజ ఏకాదశి పూజలో ఏకాదశి వ్రత కథను పఠించి విష్ణువు మంత్రాన్ని జపించాలి. దీని తరువాత ఆరాధన ముగింపులో.. శ్రీ హరికి ఆరతిని ఇచ్చి పూజా కార్యక్రమం పూర్తి చేయాలి. విష్ణువు సుఖం, శ్రేయస్సు, సంతానం కలగాలని భక్తితో కోరుకోవాలి.
- అజ ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉపవాసం చేయాలి.. ఎందుకంటే ద్వాదశి రోజున ఉపవాసం పూజ చేయకుండా అది ఏకాదశి వ్రతం పూర్తి కాదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)