RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్ బోర్డ్ పై RGV బిగ్ పంచ్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ 'జననాయగన్' సినిమా వివాదం నేపథ్యంలో, డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు 'కాలం చెల్లిన వ్యవస్థ' అని అభిప్రాయపడ్డారు. ఫోన్లలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు, సిగరెట్ బ్లర్ చేయడం 'ఒక పెద్ద జోక్' అని RGV అన్నారు. చిత్ర పరిశ్రమే దీనిని కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.
నలుగురికి నచ్చనిది.. నాకసలే నచ్చదనే యాటిట్యూడ్‌తో మాట్లాడే RGV. ఎప్పుడూ తనదైన కోణంలోనే ఓ ఇష్యూ గురించి మాట్లాడుతుంటారు. తనదైన విశ్లేషణతో.. అందర్నీ షాకయ్యేలా చేస్తూనే.. తన మాటలతో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. అలాంటి వర్మ.. ఇప్పుడు మరో సారి ఇదే చేశారు. విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ మూవీ.. సెన్సార్ బోర్డ్ మధ్య జరుగుతున్న వార్‌పై రియాక్టయ్యారు. సెన్సార్ బోర్డ్ తీరుపై.. ఆ బోర్డు ఎగ్జిస్‌టెన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రెండింగ్ టాపిక్స్‌పై రియాక్టయ్యే ఆర్జీవీ.. సెన్సార్ బోర్డ్ పై.. దాని పనితీరుపై ఈ సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డ్ అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. దాని ఉనికి ఒక పెద్ద జోక్ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈరోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని తాను భావించడం లేదన్నారు. దాని అవసరం ఎప్పుడో తీరిపోయిందని.. కానీ దానిపై చర్చంచే బద్ధకంతో ఇంకా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇందుకు ప్రధాన బాధ్యత చిత్ర పరిశ్రమదే అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు వర్మ. విపరీతమైన భావజాలాన్ని, కుట్ర సిద్ధాంతాలను.. ఈ రోజుల్లో ఫోన్ నుంచే.. ఎవరైనా, ఎక్కడైనా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడొచ్చన్నారు. 12ఏళ్ల బాలుడు ఉగ్రవాదిని హతమార్చే వీడియో చూడగలడని.. 9ఏళ్ల పిల్లాడు పోర్న్ సైట్స్ చూసే యాక్సెస్ ఉందని వర్మ గుర్తుచేశారు.ఇవన్నీ ఏ గేట్ కీపర్ లేకుండానే సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డ్ ఒక షాట్ ట్రిమ్ చేయడం వల్ల.. సిగరెట్ బ్లర్ చేయడం వల్ల.. సొసైటీని రక్షిస్తున్నామని అనుకోవడం ఒక పెద్ద జోక్ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు వర్మ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
వచ్చే నెలలో మరో DSC నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ??
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

