AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన ఉంది. మరోవైపు తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అల్లూరి జిల్లా ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారి పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తోంది. ఇది తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు తెలంగాణలోను చలి తీవ్రత కొనసాగుతోంది. చాలా చోట్ల సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత కొనసాగుతుంది. మినుములూరులో 8 డిగ్రీలు, అరకులో 10, పాడేరులో 10, చింతపల్లి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాన్ని దట్టమైన మంచు కమ్మేసింది. మరోవైపు పాడేరులో పర్యాటకుల సందడి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
వచ్చే నెలలో మరో DSC నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ??
ఆహారం కల్తీ చేస్తే.. అటెంప్ట్ టు మర్డర్ కేస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

