రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
మహబూబాబాద్‌లో రాత్రిపూట ఓ భారీ మొసలి రోడ్డుపై ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గూడూరు మండలం సీతానగరం వద్ద జరిగిన ఈ ఘటనలో, సమీపంలో చెరువులు లేకున్నా మొసలి రావడం ఆందోళన కలిగించింది. కొందరు యువకులు సాహసంతో దానిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన జనావాసాల్లో వన్యప్రాణుల సంచారంపై మళ్లీ చర్చకు దారితీసింది.
ఈమధ్య వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పులులు, చిరుతలు, పాములు, మొసళ్లు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ భారీ మొసలి రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారులకు కంగారు పుట్టించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ పరిధిలోని భూక్య దసురు తండా వాసులు నిత్యం రాకపోకలు జరిపే రోడ్డులో రాత్రి వేళ ఒక్కసారిగా మొసలి ప్రత్యక్షమైంది. వాహనాల లైట్ల వెలుగులో మొసలి రోడ్డు దాటుతూ కనిపించింది. సమీపంలో ఎక్కడా చెరువులు, కుంటలు లాంటివి కూడా లేవు. కానీ ఎక్కడినుంచి వచ్చిందో ఓ భారీ మొసలి హఠాత్తుగా నడి రోడ్డుపై ప్రత్యక్షమయింది. తండాకు వెళ్లే రాళ్ల వాగు బ్రిడ్జిపై మోసలి సంచారాన్ని అటుగా వెళుతున్న తండా వాసులు గమనించారు. భయంతో పరుగులు తీసారు. కొంత మంది యువకులు ఆ మొసలిని పట్టుకోడానికి ప్రయత్నించారు. మొసలిని చేపల వలతో బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణికి ఎలాంటి హానీ తలపెట్టకుండా దానిని కాపాడి అప్పగించిన యువకులను అటవీశాఖ అధికారులు అభినందించారు. కాగా ఈ ప్రాంతంలో మొసలి కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో తండా పరిసర ప్రాంతాల్లో ఇంకా మొసళ్ళు ఉన్నాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
ఒక్కసారి కడితే చాలు.. జీవితాంతం బీమా.. ఎల్‌ఐసీ కొత్త స్కీమ్
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది

