ఆహారం కల్తీ చేస్తే.. అటెంప్ట్ టు మర్డర్ కేస్
ప్రస్తుతం ఆహార కల్తీ విపరీతంగా పెరిగి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కల్తీని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పదే పదే పట్టుబడితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. తయారీ కేంద్రాలపై దాడులు జరుగుతాయని ఆయన తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీ..కల్తీ..కల్తీ. తాగే నీరు, పాలు, ఆహారం అన్నీ కల్తీనే. ఏది తినాలన్నా భయంగానే ఉంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తినే ఆహారంలో అప్పుడప్పుడూ కీటకాలు, ఇనుప వస్తువులు కనిపిస్తూ ఉన్న ఘటనలు చూసాం. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆహారకల్తీని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..ఆహార కల్తీని ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. కల్తీని చిన్నపాటి నేరంగా చూడొద్దని, ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే హత్యాయత్నంగా చూడాలన్నారు. చిరు వ్యాపారులే కాదు, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు సజ్జనార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
ఒక్కసారి కడితే చాలు.. జీవితాంతం బీమా.. ఎల్‌ఐసీ కొత్త స్కీమ్
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది

