AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే..?

చర్మంపై ఒక చిన్న మచ్చలా కనిపించే పుట్టుమచ్చ, కొన్నిసార్లు మీ ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద రహస్యాన్ని దాచి ఉంచుతుంది. కొందరికి ఇవి పుట్టుకతో వస్తే, మరికొందరికి వయసుతో పాటు పెరుగుతుంటాయి. అయితే అన్ని పుట్టుమచ్చలూ సాధారణమైనవి కావు. మీ శరీరపై ఉన్న పుట్టుమచ్చ రంగు మారినా లేదా పరిమాణం పెరిగినా అది ప్రమాదానికి సంకేతం కావచ్చు.

శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే..?
Causes Of Sudden Moles On Skin
Krishna S
|

Updated on: Jan 11, 2026 | 4:16 PM

Share

చాలామందికి ఒంటిపై పుట్టుమచ్చలు ఉండటం సహజం. కొందరికి ఇవి అందాన్ని ఇస్తే, మరికొందరికి ఇవి ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా అకస్మాత్తుగా కొత్త పుట్టుమచ్చలు రావడం లేదా ఉన్న మచ్చల పరిమాణం పెరగడం వంటివి జరిగినప్పుడు.. అది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా అన్న అనుమానం కలగడం సహజం. అసలు పుట్టుమచ్చలు ఎందుకు ఏర్పడతాయి? ఎప్పుడు మనం భయపడాలి? అనే విషయాలపై చర్మ నిపుణుల విశ్లేషణ ఇదీ..

అసలు పుట్టుమచ్చ అంటే ఏమిటి?

మన చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం వల్ల పుట్టుమచ్చలు ఏర్పడతాయి. చర్మంపై ఉండే మెలనోసైట్లు అనే కణాలు ఒకే చోట గుమిగూడి, ఎక్కువ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అక్కడ చిన్న మచ్చలా కనిపిస్తుంది. ఇవి నలుపు, గోధుమ, లేత గులాబీ లేదా నీలం రంగులో కూడా ఉండవచ్చు.

పుట్టుమచ్చలు పెరగడానికి ప్రధాన కారణాలు

ఒక సాధారణ వ్యక్తి శరీరంపై 10 నుండి 40 వరకు పుట్టుమచ్చలు ఉండటం సాధారణం. అయితే ఇవి పెరగడానికి పలు కారణాలు ఉంటాయి.

వంశపారంపర్యం: కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది తర్వాతి తరానికి వచ్చే అవకాశం ఉంది.

హార్మోన్ల మార్పులు: కౌమారదశ, గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొత్త మచ్చలు రావచ్చు.

సూర్యరశ్మి ప్రభావం: సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. అందుకే ఎండ తగిలే శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి.

వృద్ధాప్యం: వయసు పెరిగే కొద్దీ చర్మంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి లేదా కొత్తవి ఏర్పడవచ్చు.

ఎప్పుడు ప్రమాదకరంగా భావించాలి?

చాలా పుట్టుమచ్చలు హాని చేయవు. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి..

  • పుట్టుమచ్చ పరిమాణం హఠాత్తుగా పెరిగితే.
  • ఒకే మచ్చలో రెండు మూడు రంగులు కనిపించినా లేదా రంగు ముదురుగా మారినా.
  • మచ్చ అంచులు సమానంగా లేకపోతే.
  • మచ్చ ఉన్న చోట నిరంతరం దురద, నొప్పి కలగడం.
  • దెబ్బ తగలకుండానే పుట్టుమచ్చ నుండి రక్తం లేదా చీము రావడం.

ఇటువంటి మార్పులు చర్మ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణాలు కావచ్చు. కాబట్టి వీటిని విస్మరించడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి
దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారందరికీ అకౌంట్లోకి రూ.6 వేలు
తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారందరికీ అకౌంట్లోకి రూ.6 వేలు
శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు..
శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు..
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు