Adi Shankaracharya: అమ్మ ప్రేమ, త్యాగాన్ని తెలియజేస్తూ… మనస్సును కదిలించే ఆదిశంకరాచార్య మాతృ పంచకం
Sri Adi Shankaracharya: సనాతన హిందూ సంప్రదాయం(Hinduism)లో మాతృమూర్తికి తొలిస్థానం ఇచ్చారు. అమ్మ ప్రేమకోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడని అంటారు. అమ్మ ప్రేమ వెలకట్టలేని..అటువంటి అమ్మ చివరి దశలో..
Sri Adi Shankaracharya: సనాతన హిందూ సంప్రదాయం(Hinduism)లో మాతృమూర్తికి తొలిస్థానం ఇచ్చారు. అమ్మ ప్రేమకోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడని అంటారు. అమ్మ ప్రేమ వెలకట్టలేని..అటువంటి అమ్మ చివరి దశలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో బిడ్డ అమ్మ దగ్గరలేకపోతే.. ఆ పిలల్లు పడే బాధ, తపన వర్ణనాతీతం… ఇందుకు జగద్గురు ఆదిశంకరాచార్యలు మినహాయింపు కాదని తెలుస్తోంది. కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ (Aryamba ) మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? తల్లికి నమస్కారం చేస్తూ.. ఆది శంకరులు ఐదు శ్లోకాలను చెప్పారు. ఇవి “మాతృపంచకం” గా ప్రసిద్ధమైనవి. ఈరోజు తల్లి గొప్పదనాన్ని.. విశిష్టతను తెలియజేస్తూ… మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకాన్ని స్మరించుకొందాం.
1*ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.
భావం: అమ్మా! “నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి” అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో – ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.
2*అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహో జనన్యై రచితోయమంజలిః.
భావం: పంటిబిగువున నన్ను ప్రసవ వించే సమయంలో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
3*ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3
భావం: అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
4*గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.
భావం: కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి, మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.
5*న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను- రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.
భావం:అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ. ( సేకరణ)
(ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం)
Also Read:
బద్దలైన పిశాచాలు నివాసముండే ‘కిల్లింగ్ స్టోన్’… అరిష్టమని హడలిపోతున్న జనం