Prices Up: కొత్త సంవత్సరంలో పెరగనున్న వస్తువుల ధరలు… ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతాయంటే..?
జనవరి 2021 నుంచి ఎలక్ట్రిక్ వస్తువులైన ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి వస్తువుల ధరలు దాదాపు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

జనవరి 2021 నుంచి ఎలక్ట్రిక్ వస్తువులైన ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి వస్తువుల ధరలు దాదాపు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వీటిలో వినియోగించే ముడిపదార్థాలైన కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ ధరల ప్రభావం వీటిపై పడనుంది. దీంతోపాటు నౌకా రవాణా, విమానాల్లో కార్గో ధరల్లో పెరుగుదల ప్రభావం కూడా వీటిపై పడనుంది. ఇవే కాకుండా సరఫరా తగ్గడంతో టీవీ ప్యానల్ (ఓపెన్ సెల్) ధరలు రెండింతలయ్యాయి. దీంతో ఎల్‌జీ, పానాసానిక్, థాంమ్సన్ జనవరి నుంచి ధరలు పెంచనున్నాయి. సోనీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తోంది.. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘‘ముడిసరకుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నాం. అవి మా ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపిస్తాయి. నా అంచనా ప్రకారం జనవరిలో దాదాపు 7శాతం ధరలు పెరగవచ్చు.. తొలి త్రైమాసికంలోపు ఇవి 11శాతం వరకు చేరవచ్చు’’ అని పానాసానిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు.
ఇక జనవరి 1 నుంచి ఎల్‌జీ ఇండియా కూడా దాదాపు8 శాతం ధరలను పెంచనుంది. దీనిపై ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లియన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్‌బాబు మాట్లాడుతూ..‘‘జనవరి నుంచి మేము ధరలను అన్ని ఉత్పత్తులపై 8శాతం వరకు పెంచుతున్నాం. కాపర్, అల్యూమినియం వంటి వాటి ధరల్లో పెరుగుదల ఉంది’’ అని పేర్కొన్నారు. సోనీ ఇండియా మాత్రం వేచిచూసే ధోరణ అవలంబిస్తుందని సంస్థ భారతీయ విభాగం ఎండీ సునీల్ నయ్యర్ అన్నారు.
టీవీల్లో వినియోగించే ప్యానల్ ధరలు 200శాతం పెరిగాయి. ముఖ్యంగా వీటి సరఫరా గణనీయంగా తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణం. ఈ ప్యానళ్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా సరైన ప్రత్యామ్నాయం లేదు. ఇవి అత్యధికంగా చైనాలో మాత్రమే తయారవుతాయి. అందుకే థామ్సన్, కొడాక్ సంస్థలు ఆండ్రాయిడ్ టీవీ ధరలను జనవరి నుంచి 20శాతం పెంచనున్నాయి.
Also Read: Covid 19 Vaccine: ఆస్ట్రాజెనెకా అత్యవసర వినియోగానికి ఆమోదం..! భారత బయోటెక్‌పై త్వరలోనే నిర్ణయం…