AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఓరినాయనో.. ఇదేమైనా బాహుబలి చెట్టా..? ఒక్కో మునక్కాయ ఎంత పొడవుందో తెల్సా..?

ఇదో బాహుబలి మునగచెట్టు. ఆ చెట్టుకు కాయలు విరగకాస్తున్నాయ్.. అంతేకాదు ఒక్కో కాయ సైజ్ ఆరడుగులు వరకు ఉంటోంది. దీంతో ఆ ఊరి మునగచెట్టు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఒక్క మునక్కాయ కూర వండుకుంటే కుటుంబానికి సరిపోతుంది అంటున్నారు గ్రామస్తులు. ఇంతకీ ఆ మునగచెట్టు ఎక్కడ ఉంది..?

Andhra: ఓరినాయనో.. ఇదేమైనా బాహుబలి చెట్టా..? ఒక్కో మునక్కాయ ఎంత పొడవుందో తెల్సా..?
Drumstick
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 10, 2025 | 8:24 PM

Share

జామచెట్టుకు కాస్తాయ్‌ జామకాయలో… జామకాయలో… మామిడిచెట్టుకు కాస్తాయ్‌ మామిడి కాయలో… మామిడి కాయలో… అన్న సినీ సాంగ్‌ ఎంత ఫేమస్సో, ఆ ఊళ్లో ఓ ఇంట్లోని మునగచెట్టు అంత ఫేమస్‌… మా మునగచెట్టుకు కాస్తాయ్‌ మునక్కాయలో… మునక్కాయలో… అంటూ రాగాలు తీస్తున్నారట అక్కడి జనాలు… సాధారణంగా మునక్కాయలు రెండు లేదా మహా అయితే 3 అడుగుల పొడవుంటాయి… అయితే ఆ ఇంటి పెరట్లో ఉన్న మునగచెట్టు కాయలు మనిషంత ఎత్తు పెరుగుతున్నాయి… ఈ విషయాన్ని ఆ ఊరి జనం వింతగా చెప్పుకుంటున్నారు… తమ ఇంట్లో కూడా మునగచెట్లను పెంచుకుంటున్నారట… ఇంతకీ ఎక్కడుందా చిత్రమైన మునచెట్టు..?

బాపట్ల జిల్లా మార్టూరు నేతాజీ నగర్‌లోని శానం లక్ష్మీ ఇంటి ఆవరణలో మునగ చెట్టు విరగ కాపు కాసింది. ఆకుల కన్నా కాయలు ఎక్కువగా కనిపించటం … అవి కూడా ఐదు, ఆరు అడుగుల పొడవు ఉండటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతటి పొడవైన మునగ కాయలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఆశ్చర్యంగా కాపు కాసిన మునక్కాయలు చూసేందుకు ఊళ్ళో జనం తరలివస్తున్నారు. ఆరు అడుగుల పైగా కాయలు పొడవుగా ఉండటం ఒక విశేషమైతే… కాపు అసాధారణంగా ఉండటం మరో విచిత్రం. రైతులు ఇలాంటి మునగ పంటను పండిస్తే లాభాల పంటగా మారుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని చెట్లు ఇలా విరగకాసే అవకాశాలు తక్కువంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. జన్యు పరమైన కారణాల వల్ల చాలా అరుదుగా మాత్రమే ఇలా విరగకాపు ఉంటుందంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..