ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్, ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
samatha
10 april 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మంచిన సంపద లేదు. కానీ చాలా మంది ఇప్పుడు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అందుకే మంచి ఆహారం తీసుకోవాలంటున్నారు వైద్యులు.
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే క్యారెట్, ఉసిరికాయ ఈ రెండింటితో జ్యూస్ చేసుకొని తాగడం వలన బోలేడు లాభాలు ఉన్నాయంట. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే?
కావాల్సిన పదార్థాలు.. క్యారెట్ రెండు, ఉసిరికాయలు నాలుగు, పూదీన ఆకులు నాలుగు లేదా ఐదు, నిమ్మకాయ చారు అరకప్పు, బెల్లం ఒక కప్పు తీసుకోవాలి.
తయారీ విధానంలోకి వెళితే.. మనం ముందుగా అనుకున్న విధంగా రెండు క్యారెట్ లు తీసుకొని, వాటి తొక్క తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
తర్వాత ఉసిరికాయలను తీసుకొని, వాటిలోని గింజను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
పూదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, కొద్ది సేపు ఆరబెట్టాలి. తర్వాత వాటిని ఒక కప్పులో తీసుకోవాలి.తర్వాత తాటి మిఠాయిని తీసుకొ దానిని మెత్తటి పొడిలా చేసుకోవాలి.
వీటన్నింటిని మిక్సీ జారులోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన రసాన్ని తీసుకొని వడబోసుకోవాలి. అంతే క్యారెట్ ఉసరికాయ జ్యూస్ రెడీ.
దీనిని ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు, డైలీ కాకపోయినా, వారంలో రెండుసార్లైనా ఈ జ్యూస్ తాగాలంట.