చలవ చేసే వాటిల్లో మొదట ఉంటుంది కీరదోస. ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి
TV9 Telugu
95 శాతం నీరే ఉంటుంది కనుక డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. కీరదోస తినడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది
TV9 Telugu
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముడతలు రావు. కంటిచూపు మెరుగవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అల్జీమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది. కీరదోసలోని సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
ఇందులోని కె-విటమిన్ ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని తెస్తుంది. ఇందులో యాంటీక్యాన్సర్ గుణాలు ఉన్నందున క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస పిల్లలూ, పెద్దలూ అందరికీ మంచిది. ఇందులో ఉన్న సిలికా కురులను, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
వేసవిలో ఎక్కువగా చాలా మంది కీర దోస సలాడ్ తింటుంటారు. కీరదోసలోని నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కొంతమంది కీరదోస సలాడ్‌లో ఉప్పు వేసి తింటారు
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీరదోసలో ఉప్పును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అతిగా తినడం వల్ల అధిక రక్తపోటు, నీరు నిలుపుదల సమస్య ఏర్పడవచ్చు
TV9 Telugu
కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. కీరదోస రసంలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి
TV9 Telugu
దీన్ని తినడమే కాకుండా, చర్మానికి రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. కీరదోసలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటే ప్రతిరోజూ కీరదోస తినడం మంచిది