రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు.. బంద్‌కు సంఘీభావం తెలిపిన వైసీపీ
ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ మార్చి 5 రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ..
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిచాలనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నుంచి ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న రాష్ట్ర బంద్ నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. అయితే రేపటి రాష్ట్ర బంద్‌కు అధికార పార్టీ వైసీపీ సంఘీభావం ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని మంత్రి పేర్ని నాని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని పేర్ని నాని చెప్పారు.
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలపనున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు టీడీపీ తన మద్దతు ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.
ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ మార్చి 5 రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా 2.5 లక్షల కోట్లు సమీకరిస్తామని మోడీ ప్రకటన చేయడం బీజేపీ మతోన్మాద, నియంతృత్వ విధానాలకు పరాకాష్ట అని సీఐటీయూ నేతలు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఏ ప్రత్యేకతా లేకుండా చేసి కేంద్రంపై ఆధారపడాలనే కుట్రతోనే ఆంధ్రాబ్యాంక్ కంటే 3 రేట్లు చిన్నదైన యూనియన్ బ్యాంకులో విలీనం చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి వన్నె తెచ్చిన నవరత్న హోదా కలిగిన ఏకైక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రేవేటికరణ ద్వారా నిర్వీర్యం చేయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ నేతలు మండిపడ్డారు. గతంలో విశాఖ ప్రాంతంలో హిందూస్థాన్ జింక్ పరిశ్రమను నష్టాలొస్తున్నాయని వాజ్ పాయి హయాంలో వేదాంత గ్రూపుకు అమ్మేశారని, 2014లో వేదాంత గ్రూపు పరిశ్రమను పూర్తిగా మూసివేసి 3వేల ఎకరాల పరిశ్రమ భూమిని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటుందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములైన 30వేల ఎకరాలను కాజేయడానికే ప్రేవేటికరిస్తున్నారని విమర్శించారు.
నిజంగా నష్టాలనుండి విశాఖ ఉక్కుని బయటపడేయాలంటే సొంత ఘనులు కేటాయిస్తే సరిపోతుందని అన్నారు. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుందని, అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించటమే దేశంలో అతిపెద్ద అవినీతని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ అవసరాలకు నిధుల సమీకరణ పేరుతో దేశీయ సంస్థలను విదేశీయులకు అమ్ముతూ, మరోపక్క 6ఏళ్లలో 200 కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 9లక్షల కోట్ల ఆదాయపు పన్ను మాఫీచేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అందుకే కార్పొరేట్ కంపెనీలనుండి బీజేపీ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు వేలకోట్లు పోగేసుకుంటు అవినీతిని సంస్థాగతం చేస్తుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం జరిగే మార్చ్ 5 రాష్ట్ర బంద్ కి రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజప్తి చేశారు. ఈ బంద్ జయప్రదం కోరుతూ మార్చ్ 2వతేది విస్తృత సమావేశం విశాఖ ఉక్కు పరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య మేధావులు, సామాజిక ఉద్యమకారులు, దళిత, మైనారిటీ సంఘాలు, జిల్లా ప్రజానీకం, వ్యాపార సంఘాలు, ఆటో, ట్రాన్స్ పోర్ట్ సోదరులు ఈ బంద్ లో స్వచ్చందంగా పాల్గొని ఆంధ్ర ప్రజల స్వాభిమానాన్ని చాటాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జరిగే పోరాటాలను మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు.
Read More: