ఎమ్మెల్సీ కవితతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం భేటీ.. టీఆర్‌ఎస్‌ గెలుపులో కురుమల పాత్ర మరువలేనిదన్న కవిత

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ కార్యక్రమాలు..

ఎమ్మెల్సీ కవితతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం భేటీ.. టీఆర్‌ఎస్‌ గెలుపులో కురుమల పాత్ర మరువలేనిదన్న కవిత
Follow us

|

Updated on: Mar 04, 2021 | 3:40 PM

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరందుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలతో సమాధానం చెప్పాలని ఆ పార్టీ భావిస్తుంది. అంతేకాదు.. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ఈ ఫలితాలు బూస్ట్‌గా ఉపయోగపడతాయని ఎలాగైనా రెండు స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుంది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం పర్వంలోకి దిగారు. ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల్లో తిష్ట వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక మరోవైపు కుల సంఘాలను కలుస్తూ వారి ఓట్లకు గాలం వేస్తున్నారు. ప్రభుత్వం పథకాల ఫలాలు కులంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నారు‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ గారు గొల్ల కురుమల కోసం ‌అమలు చేస్తున్నారన్నారు. గొల్ల కురుమ సోదరులు నిరంతరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు గా నిలిచారన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ పార్టీ గెలుపులో వారి పాత్ర మరువలేనిదన్నారు. యాదవులు సీఎం గా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు, తెలంగాణలో గొల్ల కురుమలకు ఇవ్వడం జరిగిందన్నారు.

స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నేరుగా బడ్జెట్ నుండే నిధులు కేటాయించాలని సీఎం గారిని కోరుతామన్నారు ఎమ్మెల్సీ కవిత. కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామన్న ఎమ్మెల్సీ కవిత…కామారెడ్డిలో కురుమ సంఘం భవన నిర్మాణం పూర్తయిన అనంతరం అక్కడే సభ నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కేశ వేణు, ప్రధాన కార్యదర్శి వొరక దేవన్న, సంఘ నాయుకులు పాల్గొన్నారు.

ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్ మద్దతు

అనంతరం ఎమ్మెల్సీ కవితతో ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ‌ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ప్రకటించింది ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ( UTA-TS). ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు కుతుబుద్దీన్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసి మద్దతు లేఖను అందించారు. అసోసియేషన్ కు చెందిన 7000 మంది సభ్యులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గార్లకు మద్దతు గా నిలవనునన్నారని తెలిపారు.

Read More:

రేషన్‌ బియ్యంకోసం ప్రాణాలు పోయే పరిస్థితి.. వృద్ధ మహిళలకు సంకటంగా మారిన ఓటీపీ లింక్‌ విధానం

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో ముక్కోణపు పోటీ.. జీవీఎంసీపై జెండా ఎగిరేసేందుకు ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు