AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఏపీలో కరకట్ట మహా సంగ్రామం.. అయ్యన్న, బాబుపై విరుచుకుపడుతోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

కరకట్టపై జరిగిన రాజకీయ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉదయం నుంచి వరుసబెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు

AP Politics: ఏపీలో కరకట్ట మహా సంగ్రామం.. అయ్యన్న, బాబుపై విరుచుకుపడుతోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
145
Venkata Narayana
|

Updated on: Sep 18, 2021 | 5:57 PM

Share

YSRCP – TDP: కరకట్టపై జరిగిన రాజకీయ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉదయం నుంచి వరుసబెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. ఇక, ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర నిన్న జరిగిన పరిణామాలపై యాక్షన్‌ మొదలు పెట్టారు పోలీసులు. ఇరు వైపుల వారిపై కేసులు పెట్టారు. వైసీపీ, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నాలుగు కేసులు నమోదు చేశారు. విజువల్స్‌ ఆధారంగా ఈ కేసులు పెట్టారు తాడేపల్లి పోలీసులు.

టీడీపీ నేతల ఫిర్యాదుతో మూడు కేసులు, జోగి రమేష్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు జంగాల సాంబశివరావు, తిరుమలయ్య, బుస్సా మధుసూదన్ రావు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ డ్రైవర్ తాండ్రరాము ఫిర్యాదుతో టీడీపీ నేతలపై ఐపీసీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1), 3(2) కింద, IPC సెక్షన్‌ 144, 148, 149, 188, 269, 270, 294బి, 341, 352, 427. 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

తనపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు హోంమంత్రి సుచరిత. ఒక దళిత మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అయ్యన్న సంస్కారం ఏంటో అందరికీ అర్థమైందన్నారు. అయినా అలాంటి అసుద్దాల మీద తాను రాయి వేయబోనని వ్యాఖ్యానించారు. హోంమంత్రి సుచరితను కించపరుస్తూ మాట్లాడిన అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, ఆయన్ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. గుంటూరు రూరల్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన అయ్యన్నపై చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.

సీఎం జగన్‌పై అయ్యన్న వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు జోగి రమేష్‌. లేదంటే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే అక్కడ నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని, భాష మారకపోతే అది కంటిన్యూ అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు జోగి రమేష్‌. ఇక, ప్రశ్నిస్తాం. ఏం పీక్కుంటారో పీక్కోండి అని అయ్యన్న అంటే.. జనం మీ జెండానే పీకేశారు. ఇంకే పీకాలి అంటూ కౌంటర్‌ ఇచ్చారు రోజా. క్షమాపణ చెప్పాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేస్తే.. రా ఈసారి చూసుకుందాం అంటూ ఆయనకు సవాల్‌ విసిరారు బోండా ఉమ.

అయ్యన్నపాత్రుడు గంజాయి, మాఫియా డాన్‌ అంటూ ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. త్వరలోనే ఆయన అవినీతి చిట్టాను బయట పెడతామన్నారు. అయ్యన్న అక్రమార్జన వల్లే ఆయన సోదరుడు బలయ్యాడని వ్యాఖ్యానించారు. మరోవైపు 24 గంటల్లో అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు చింతకాయల సన్యాసిపాత్రుడు. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి