Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indira Shobhan: షర్మిల పార్టీ ప్రకటన తోనే కొంత మార్పు కనిపిస్తోంది.. రేపు ఉ. 8 నుంచి సా. 6 వరకు దీక్ష : ఇందిరా శోభన్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్ టీపీ కీలకనేత ఇందిరా శోభన్ అన్నారు. నిరుద్యోగ యువత..

Indira Shobhan:  షర్మిల పార్టీ ప్రకటన తోనే కొంత మార్పు కనిపిస్తోంది.. రేపు ఉ. 8 నుంచి సా. 6 వరకు దీక్ష : ఇందిరా శోభన్
Ys Sharmila And Shoban
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 3:21 PM

YS Sharmila Deeksha: నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్ టీపీ కీలకనేత ఇందిరా శోభన్ అన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరిన ఆమె, మీకోసం వైయస్సార్ టీపీ కొట్లాడుతుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణాను కేసీఆర్ దగా చేస్తున్నారని చెప్పుకొచ్చిన ఇందిరా శోభన్.. కవితకు ఆగమేఘాల మీద ఉద్యోగం కల్పించిన కేసీఆర్, ఎందుకు నోటిఫికేషన్లు విడుదల చేయరని ప్రశ్నించారు.

నిరుద్యోగ అమరుడు కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు షర్మిల దీక్షలో కూర్చుంటారని ఇందిర తెలిపారు. ఎన్నికలప్పుడే నోటిఫికేషనులు గుర్తుకొస్తాయి, ఎన్నికలు అయ్యాక మళ్ళీ వాటి ఊసే ఎత్తారంటూ ఇందిరా ఎద్దేవా చేశారు.

ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు.. మరి యెట్లా యువత బతికేది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “ప్రతి ఊరిలో ఉన్న నిరుద్యోగి గడప తొక్కుతాం, ఉద్యోగాలు ఇవ్వండి.. బతికుండగా పలకరించని వాళ్లు చనిపోగానే పరామర్శలు వెళ్తున్నారు. షర్మిల పార్టీ ప్రకటనతోనే కొంత మార్పు కనిపిస్తుంది.” అని ఇందిరా పేర్కొన్నారు.

Read also: YSRCP Vijayasai reddy: చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు : విజయసాయిరెడ్డి