YS Sharmila: సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉందా?.. కృష్ణా నదీ జలాల వివాదంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
కృష్ణా నదీ జలాల వివాదంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే..
YS Sharmila Sensational Comments in YSRTP Launching Programme: కృష్ణా నదీ జలాల వివాదంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్‌కు ఇప్పుడే తెలివి వచ్చిందా అని షర్మిల ప్రశ్నించారు. పక్క రాష్ట్రం సీఎంను పిలిపించుకుని భోజనం పెట్టినప్పుడు తెలియదా అని ఆమె ఎద్దేవా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడి శత్రువును ఓడించవచ్చని తెలిపారు. 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయితీని మాట్లాడుకోలేరా, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని షర్మిల ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి మీ లేదా అని ఆమె నిలదీశారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణగా ఆమె స్వయంగా ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాతో పాటు ఎజెండాను హైదరాబాద్ రాయదుర్గలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సభా వేదికపై వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామనుకున్నాం.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు షర్మిల. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలవరం వరకు కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని కూడా వదులుకోమన్న షర్మిల.. కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం కోసం జలయజ్ఞానికి వైఎస్ రూపకల్పన చేశారని గుర్తుచేశారు. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన నీటి బొట్టును అడ్డుకోబోమన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నది వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్ధాంతమన్నారు. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ ఉందంటే దానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డియే. భారాన్ని తన భుజాన వేసుకుని 2 సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని షర్మిల గుర్తు చేశారు.
ఇంకా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ పేరును పలికే అర్హత కూడా లేదు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయని పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నాడు. ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగానలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదా?. వైఎస్ గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేదీలేదన్నారు. వైఎస్‌ఆర్ కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకమని వైఎస్ షర్మిల అన్నారు. ఎంత కష్టమైన పనైనా వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. వైఎస్ ఏ పనినైనా గుండె నిబ్బరంతో సాధించారని చెప్పారు. సాయం అడిగితే రాజకీయాలకు అతీతంగా చేశారని కొనియాడారు.తెలంగాణలో వైఎస్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. Read Also… PM Modi Cabinet: ఒక్క ఫోన్ కాల్‌తో 12మంది కేంద్రమంత్రి పదవులు ఫసక్.. అసలు ఆ కాల్ ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది!?