AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTDP Chief L Ramana: ప్రగతి భవన్లో కేసీఆర్‌తో భేటీ అయిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కొంచెం సేపటి క్రితం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు.

TTDP Chief L Ramana: ప్రగతి భవన్లో కేసీఆర్‌తో భేటీ అయిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ
L Ramana
Venkata Narayana
|

Updated on: Jul 08, 2021 | 8:49 PM

Share

L Ramana – CM KCR: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కొంచెం సేపటి క్రితం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్ రమణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. టీడీపీ తెలంగాణ శాఖలో అధ్యక్ష హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్‌లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

గులాబీ కండువా కప్పుకున్న వేళ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. రమణ కారెక్కడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక భూమిక పోషించారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రమణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలుగుదేశం పార్టీ బలం క్రమక్రమంగా తగ్గుతుండటంతో గత్యంతరం లేని పరిస్థిత్లో రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా రమణ టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

టీడీపీ కార్యకర్తలతో కూడా ఈ విషయం గురించి రమణ చర్చలు జరిపారు. వారు కూడా ఓకే చెప్పడంతో గులాబీ దళంలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది. కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి రమణ సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు . చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని రమణకు పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు.

Read also:  KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే