వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో బాబు కింగ్-జగన్

వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో బాబు కింగ్-జగన్

గుంటూరు :ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ జోరు పెంచారు. సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శల దాడి చేస్తున్నారు. అసలు రాజధానిలో ఏం కట్టారో, ఎంత అభివృద్ధి సాధించారో చెప్పకుండా పదే..పదే ప్రతిపక్షంపై దాడి చేయడం చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనం అని జగన్ అన్నారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ నియోజక వర్గంలో దాదాపు 50 గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి పంటకు వైరస్‌ వచ్చి […]

Ram Naramaneni

|

Mar 28, 2019 | 5:45 PM

గుంటూరు :ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ జోరు పెంచారు. సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శల దాడి చేస్తున్నారు. అసలు రాజధానిలో ఏం కట్టారో, ఎంత అభివృద్ధి సాధించారో చెప్పకుండా పదే..పదే ప్రతిపక్షంపై దాడి చేయడం చంద్రబాబు చేతకాని తనానికి నిదర్శనం అని జగన్ అన్నారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఈ నియోజక వర్గంలో దాదాపు 50 గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిర్చి పంటకు వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు తమకు ఎలాంటి సాయం చేయలేదని రైతులు తనతో చెప్పారన్నారు. నాగార్జునసాగర్‌ ఉన్నా.. సాగు, తాగు నీరు లేదని చెప్పి ఆ సమస్యను పరిష్కరించకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లయ్‌ చేస్తూ.. ప్రజల నుంచి డబ్బులు అడ్డగోలుగా  వసూలు చేయడానికి  నీరు-చెట్టు అనే పథకాన్ని పెట్టి  దోచుకుంటుందని జగన్ ఆరోపించారు.

నవరత్నాల పథకాలను కాపీ కొట్టి చివరి రెండు నెలల్లో  ఏదో ప్రజలకు అంతా చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించి..వ్యవస్థల మేనేజర్‌కి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu