AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit-2026: దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మేధోమథన వేదిక.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు సోమవారం (మార్చి 23) న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారతదేశం – ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలవనుంది.

TV9 WITT Summit-2026: దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మేధోమథన వేదిక.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Pm Modi In Tv9 Witt Summit 2026
Balaraju Goud
|

Updated on: Mar 23, 2026 | 11:47 AM

Share

భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మేధావులు, వ్యాపార దిగ్గజాలు, విధాన రూపకర్తలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2026 సదస్సు సోమవారం (మార్చి 23) న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారతదేశం – ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ రెండ్రోజుల సదస్సు, దేశ అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక గొప్ప మేధోమథన వేదికగా నిలవనుంది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు.

దేశంలోనే అతిపెద్ద వార్తా సంస్థ అయిన టీవీ9 నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ 2026’ నేడు, సోమవారం (మార్చి 23) ప్రారంభమవుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. సదస్సు మొదటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక సమ్మిట్‌లో ఆయన పాల్గొనడం ఇది వరుసగా మూడవసారి. ప్రధానితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల హేమాహేమీలు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రపంచ వేదికపై మారుతున్న దేశ పాత్ర, భవిష్యత్ లక్ష్యాలపై ప్రధాని ఇచ్చే సందేశం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సత్తా సమ్మేళనం మరుసటి రోజైన మార్చి 24న జరగనుంది.

2025లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీ9 నెట్‌వర్క్ వేదిక నుండి ‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావించి, టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రశంసించారు. టీవీ9 నెట్‌వర్క్‌కు పెద్ద ప్రాంతీయ ప్రేక్షకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు టీవీ9 ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను కూడా అభివృద్ధి చేసుకుంటోందని ఆయన తెలిపారు.

‘వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్’లో ఎవరెరవరు పాల్గొంటున్నారంటే,

పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి

అశ్విని వైష్ణవ్, రైల్వే, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి

జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సమాచార శాఖ మంత్రి

స్మృతి ఇరానీ, మాజీ కేంద్ర మంత్రి

అఖిలేష్ యాదవ్, అధ్యక్షుడు, సమాజ్‌వాదీ పార్టీ

డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక

అసదుద్దీన్ ఒవైసీ, AIMIM అధ్యక్షుడు

మోహన్ యాదవ్, ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్

పుష్కర్ ధామి, ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్

భజన్‌లాల్ శర్మ, ముఖ్యమంత్రి, రాజస్థాన్

రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ

భగవంత్ మాన్, ముఖ్యమంత్రి, పంజాబ్

కవి కుమార్ విశ్వాస్

సమీర్ అంజాన్, గీత రచయిత

నీలేష్ మిశ్రా, గీత రచయిత, రచయిత

యతీంద్ర మిశ్రా, కవి, రచయిత

స్వామి రామ్‌దేవ్, యోగా గురువు

సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

అక్షర్ పటేల్, టీ20 ప్రపంచ ఛాంపియన్

అర్ష్‌దీప్ సింగ్, టీ20 ప్రపంచ ఛాంపియన్

దీప్తి శర్మ, ప్రపంచకప్ ఛాంపియన్

ఆవిష్కర్ సాల్వి, బౌలింగ్ కోచ్, మహిళల క్రికెట్ జట్టు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us