కాస్త ఉప్పు, కారం.. పచ్చి మామిడికాయ ఇలా తింటే ఊహించని లాభాలు!

Samatha

23 march 2026

పుల్ల పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పచ్చిమామిడికాయను తింటారు.

పచ్చి మామిడికాయ

ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా పచ్చిమామిడి కాయ తినడానికే ఇంట్రస్ట్ చూపుతారు.

సమ్మర్

అయితే ఈ పచ్చి మామిడికాయలను కొంత మంది నార్మల్‌గా తింటే, మరికొంత మంది ఉప్పు, కారంతో తింటారు. అయితే వీటిని ఉప్పుకారంతో తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంట

ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మామిడిలో పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన సమ్మర్‌లో దీనిని తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుందంట.

జీర్ణక్రియ

అలాగే పచ్చి మామిడిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

విటమిన్ సి

పచ్చి మామిడిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన ఇది చెడు కొవ్వును తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కేలరీలు

కాలేయ ఆరోగ్యానికి కూడా పచ్చి మామిడి చాలా మంచిది. ఇది కాలేయాన్ని శుభ్రపరచి, కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాలేయ ఆరోగ్యం

అంతే కాకుండా దీనిని కారం లేదా ఉప్పుతో తినడం వలన లో బీపీ తగ్గుతుంది. అలాగే ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుందంట.

ఆరోగ్యానికి మేలు