SSB Constable Jobs 2026: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 వరకు జీతం
SSB Constable (Non-GD) Recruitment 2026: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సశస్త్ర సీమా బల్ (SSB).. గ్రూప్ సి నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 827 కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులను భర్తీ చేయనుంది.సశస్త్ర సీమా బల్ (SSB)..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (SSB).. గ్రూప్ సి నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 827 కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులను భర్తీ చేయనుంది. నాన్-గెజిటెడ్ పోస్టులైన వెటర్నరీ, డ్రైవర్, గార్డెనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్‌మ్యాన్, బార్బర్, వెయిటర్, నర్సింగ్ తదితర కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు..
- కానిస్టేబుల్ (డ్రైవర్ – పురుషులు) పోస్టుల సంఖ్య: 553
- కానిస్టేబుల్ (వెటర్నరీ) పోస్టుల సంఖ్య: 34
- కానిస్టేబుల్ (వాషర్‌మెన్) పోస్టుల సంఖ్య: 74
- కానిస్టేబుల్ (బార్బర్) పోస్టుల సంఖ్య: 43
- కానిస్టేబుల్ (గార్డెనర్) పోస్టుల సంఖ్య: 41
- కానిస్టేబుల్ (టైలర్) పోస్టుల సంఖ్య: 41
- కానిస్టేబుల్ (కోబ్లర్/షూ మేకర్) పోస్టుల సంఖ్య: 25
- కానిస్టేబుల్ (కార్పెంటర్) పోస్టుల సంఖ్య: 7
- కానిస్టేబుల్ (వాటర్ క్యారియర్) పోస్టుల సంఖ్య: 5
- కానిస్టేబుల్ (వెయిటర్) పోస్టుల సంఖ్య: 3
- కానిస్టేబుల్ (నర్సింగ్ ఆర్డర్లీ) పోస్టుల సంఖ్య: 1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెటర్నరీ, నర్సింగ్ వంటి పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లలో ఏడాది అనుభవం లేదా ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి డ్రైవర్, వెటర్నరీ, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, కార్పెంటర్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్ మార్చి 21, 2026న వెలువడింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. పీఈటీ/పీఎస్‌టీ, రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




