AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Tanmay: జబర్దస్త్ తన్మయి ఇన్ని పెద్ద చదువులు చదివిందా? కానీ ఆ సమస్యలతో ఇప్పుడిలా..

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తన్మయి ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన ఆమె..

Jabardasth Tanmay: జబర్దస్త్ తన్మయి ఇన్ని పెద్ద చదువులు చదివిందా? కానీ ఆ సమస్యలతో ఇప్పుడిలా..
Jabardasth Tanmay
Basha Shek
|

Updated on: Mar 23, 2026 | 11:33 AM

Share

అబ్బాయిగా పుట్టినప్పటికీ తాను ఎందుకు అమ్మాయిగా మారాల్సి వచ్చిందో ఓ టీవీ షోలో ధైర్యంగా చెప్పుకొచ్చింది తన్మయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె హార్మోన్ల అసమతుల్యత కారణంగా తాను లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన్మయి. రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. అలాగే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం జబర్దస్త్ నటీనటులతో డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది తన్మయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది తన్మయి. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన చదువుల గురించి కూడా చెప్పుకొచ్చింది.

‘నేను గుంటూరు సెయింట్ మేరీస్ లో ఎంబీఏ చదివాను. అప్పుడే జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. జబర్దస్త్, ఈవెంట్స్ చేసుకుంటూనే కొనసాగించాను. అయితే ఇంట్లోఆర్థిక సమస్యలు ఉండటం వల్ల ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. దీనికి తోడు ఇంట్లో సమస్యలు ఎక్కువ అవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ చదవలేదు. అంతకుముందు కూడా నేను ఐపీసీసీ లో సీపీటీ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేశాను. 200 మార్కులకు 194 మార్కులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆర్టికల్స్ చేయడానికి ఫీజు లేక ఆపేశాను. లేకపోతే నేనూ ఒక మంచి సీఏ అయ్యేదాన్ని. కుటుంబ సభ్యుల కష్టాల కారణంగానే చదువును ఆపేశాను. అదే సమయంలో డబ్బులు వస్తున్నాయని జబర్దస్త్, ఈవెంట్స్ చేసుకుంటూ ఉండిపోయాను ‘ అని తన్మయి ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా కొన్ని నెలల క్రితమే జబర్దస్త్ తన్మయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఉగాది వేడుకల్లో తన్మయి..

వృద్దులకు అండగా నిలుస్తూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..