పాములు అనుకుంటే పొరపాటే.. అచ్చం పాముల్లా మెలికలు తిరిగే చేపల గురించి తెలుసా?

Samatha

23 march 2026

నీటిలో అచ్చం పామలను పోలి ఉండే చేప జాతులు ఉన్నాయి. అవి చూస్తే అచ్చం సర్పంలా కదలికలు జరుపుతూ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. మరి అవి ఏవో చూసేద్దాం పదండి.

పాముల లాంటి చేపలు

బిచిర్‌లు పొడవాటి, పాములాంటి శరీరం, రూపాన్ని కలిగి ఉంటాయి. ఈ రకమైన చేపలు ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. వీటిపై చిన్న చిన్న రెక్కలు ఉంటాయి.

బిచిర్‌లు

కాంగర్ ఈల్.. ఇవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నేలల్లో నివసించే పెద్ద పాములాంటి చేపలు. ఇవి చూడటానికి అచ్చం పాముల్లా కనిపిస్తాయి.

కాంగర్ ఈల్

పైప్ ఫిష్.. ఇది చూడటానికి ఒక చిన్న పైపులా, అచ్చం పాముల ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది. అత్యంత సుందరమైన చేపలలో ఇవి ముందుంటాయి. సముద్రపు గడ్డి పలకలలో కనిపిస్తాయి.

పైప్ ఫిష్

హాక్ ఫిష్‌లు చూడటానికి చాలా లావు అయిన పాముల్లా కనిపిస్తాయి. ఇి సమాత్రపు అడుగున కుళ్లిపోతున్న జంతువుల తోలు తొలుచుకుని తింటాయి. చూడటానికి పాముల్లాగానే ఉంటాయి.

హాక్ ఫిష్

అచ్చం పాము చర్మాన్ని పోలి ఉండే చేపల్లో ఊపిరితిత్తుల చేప ఒకటి. దీనిని ఈల్ చేప, ఊపిరితిత్తుల చేప అని అంటారు. ఇవి గాలిని పీల్చుకోగలవు, అందువలన ఇవి భూమిపై కూడా జీవించి ఉంటాయి.

ఈల్ ఫిష్

రీడ్ ఫిష్ అని పిలవబడే రోప్ ఫిష్‌లు అచ్చం పాము శరీరాన్ని పోలి ఉండటమే కాకుండా అచ్చం పాముల్లా ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా ఈదుతాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికన్ జలాల్లో కనిపిస్తాయి.

రీడ్ ఫిష్

మోరే ఈల్, ఇది చాలా పొడవైన చేప. ఇది రాతి పగుళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దాని దంతాలు చాలా పదునైనవి , అలాగే ఇది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మోరే ఈల్