త్రిముఖ పోటీ జనసేనకు లాభిస్తుందా..?

పార్టీని స్థాపించిన ఐదేళ్ల తరువాత ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్న జనసేనాని.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన ఏ మేరకు సీట్లను గెలుస్తుంది అన్న విషయాన్ని పక్కనపెడితే ఆ పార్టీ గెలిచే స్థానాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యటనలు చేసిన పవన్ కల్యాణ్ రానున్న […]

త్రిముఖ పోటీ జనసేనకు లాభిస్తుందా..?
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 12:11 PM

పార్టీని స్థాపించిన ఐదేళ్ల తరువాత ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్న జనసేనాని.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన ఏ మేరకు సీట్లను గెలుస్తుంది అన్న విషయాన్ని పక్కనపెడితే ఆ పార్టీ గెలిచే స్థానాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యటనలు చేసిన పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేస్తానంటూ పలు నియోజకవర్గాల పేర్లను తెలిపారు. అయితే అందరూ ఊహించినట్లుగానే గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం(భీమవరం), కోస్తాలోని మరో నియోజకవర్గం(గాజువాక)నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు పవన్. అయితే ఒక స్ట్రాటెజీతోనే పవన్ ఈ నియోజకవర్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, ఉత్తర కోస్తాలలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీపోటీ ఉంది. అక్కడ ఆ రెండు పార్టీలకు జనసేన గట్టి పోటీని ఇవ్వలేదు. అందుకే వాటి జోలికి వెళ్లకుండా పవన్ కల్యాణ్ సురక్షిత నియోజకవర్గాలను ఎంచుకున్నారని తెలుస్తోంది. అలాగే భీమవరం, గాజువాకలలో తన నియోజకవర్గం(కాపు) అధిక సంఖ్యలో ఉంటారు. అందుకే ఆ ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే కొన్ని ప్రాంతాలు మినహాయించి ఏపీ ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపదని రాజకీయ నిపుణులు తేలుస్తున్నారు.