అందుకే బాలయ్య అల్లుళ్లు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారా..!

ఇప్పటికే తెలంగాణాలో దాదాపుగా కనుమరుగైపోయిన టీడీపీకి ఏపీలోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లతో ఘోర ఓటమి పాలవ్వడం.. ఆ తరువాత కీలక నేతలు కొంతమంది పార్టీ మారడం.. మరికొందరు మారేందుకు సిద్ధంగా ఉండటంతో దాదాపుగా టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న చాలా మంది వయసు పైబడిన వాళ్లు ఉండటంతో పార్టీని నడిపే శక్తి కోసం అభిమానులు, […]

అందుకే బాలయ్య అల్లుళ్లు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 06, 2019 | 8:24 PM

ఇప్పటికే తెలంగాణాలో దాదాపుగా కనుమరుగైపోయిన టీడీపీకి ఏపీలోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లతో ఘోర ఓటమి పాలవ్వడం.. ఆ తరువాత కీలక నేతలు కొంతమంది పార్టీ మారడం.. మరికొందరు మారేందుకు సిద్ధంగా ఉండటంతో దాదాపుగా టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న చాలా మంది వయసు పైబడిన వాళ్లు ఉండటంతో పార్టీని నడిపే శక్తి కోసం అభిమానులు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి మనసులో జూనియర్ ఎన్టీఆర్ మెదులుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పగ్గాలు జూనియర్‌కు ఇస్తేనే మేలన్నది అభిమానులు, కార్యకర్తలు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ విషయాన్ని వారు కూడా సోషల్ మీడియాల్లో బలంగా చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో అటు నందమూరి, ఇటు నారా వారి ఫ్యామిలీలు సముఖంగా లేదన్నది కొందరి మాట. దీనికి ఇటీవల బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు చేసిన వ్యాఖ్యలే ఉదాహరణలుగా చెబుతున్నారు. ఆ మధ్యన బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పార్టీకి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎన్టీఆర్ అవసరం పార్టీకేం లేదు’’ అని కామెంట్లు చేశారు. పోని అతనేదో తెలియక అన్నాడు అనుకుంటే.. నిన్నటికి నిన్న చంద్రబాబు తనయుడు, బాలయ్య పెద్దల్లుడు నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ఏ ఒకరి సొత్తు కాదు. ఇప్పుడున్న వాళ్లందరూ పార్టీ కోసం పనిచేసే వాళ్లే. ఎవరైనా వచ్చి పార్టీకి పనిచేయొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్తేం కాదు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేశాడు. అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తల్లో ఆయన తన వ్యాఖ్యలతో ఉత్సాహాన్ని నింపాడు. కానీ వైఎస్‌ ప్రభంజనం ముందు టీడీపీ పార్టీ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన జూనియర్.. కొన్ని కారణాల వలన నారా, నందమూరి కుటుంబానికి కూడా అంటీముట్టగానే వ్యవహరిస్తూ వచ్చాడు. ఇక గతేడాది హరికృష్ణ మరణం తరువాత పరిస్థితులు మళ్లీ మారాయి. ఆయన మృతి తరువాత ఆ రెండు కుటుంబాలకు జూనియర్ మళ్లీ కాస్త దగ్గరైనట్లు తెలిసింది. ఇక ఆ తరువాత హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండగా.. ఆమెకు మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించుకున్న జూనియర్.. ఆమెకు సోషల్ మీడియాలో మాత్రమే మద్దతు తెలిపి ఊరుకుండిపోయారు. పోనీ ఏపీలోనైనా ప్రచారం చేస్తాడని అనుకున్నా.. అప్పుడు కూడా చేయలేదు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ను కుటుంబం పరంగా కలుపుకుంటున్న నారా, నందమూరి కుటుంబాలు రాజకీయపరంగా మాత్రం దూరంగా పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీ పార్టీ పగ్గాలను అతడికి ఇచ్చేందుకు ఏ మాత్రం ఈ రెండు కుటుంబాలకు ఇష్టం లేదన్నది కొందరి వాదన. ఏది ఏమైనా ఎన్టీఆర్‌పై బాలయ్య అల్లుళ్లు చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.