జగన్.. ఎందుకు ‘ఐ-పాడ్స్’ మీద ఫోకస్ పెట్టారు..?
పాలనలో పారదర్శకత, పొదుపు మంత్రం.. సీఎం అయినప్పటి నుంచీ జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది వీటి మీదే. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో జగన్ వైఖరి అందరినీ ఆకర్షించింది. అలాంటిది ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైందట. జగన్ ఏంటి..? ఇలా చేయడం ఏంటి..? అన్నదే ఆ డిస్కర్షన్ అట.. ఇంతకీ జగన్ ఏం చేశారు..? పొదుపు మంత్రం జపిస్తోన్న ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా దాన్ని పక్కన పెట్టారా..? ఏపీ […]
పాలనలో పారదర్శకత, పొదుపు మంత్రం.. సీఎం అయినప్పటి నుంచీ జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది వీటి మీదే. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో జగన్ వైఖరి అందరినీ ఆకర్షించింది. అలాంటిది ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైందట. జగన్ ఏంటి..? ఇలా చేయడం ఏంటి..? అన్నదే ఆ డిస్కర్షన్ అట.. ఇంతకీ జగన్ ఏం చేశారు..? పొదుపు మంత్రం జపిస్తోన్న ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా దాన్ని పక్కన పెట్టారా..?
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్.. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పొదుపుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా.. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరికీ ‘ఐ-పాడ్స్’ ఇచ్చారు. ఒక్కో ‘ఐ-పాడ్స్’ విలువ దాదాపు రూ.50 వేలకు పైగానే ఉందట. ఈ ‘ఐ-పాడ్స్’ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాడతారా..? వాటిని సద్వినియోగం చేసుకుంటారా..? అన్న ప్రశ్నకు పొలిటికల్ సర్కిల్స్ నుంచే సరైన సమాధానం రావడం లేదు. దీంతో.. పొదుపు మంత్రం జపిస్తోన్న ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న చర్చ రాజకీయా వర్గాల్లో సాగుతోందట.
స్టార్ హోటల్స్‌లో సమీక్షలు వద్దు.. సమావేశాల్లో జీడిపప్పులు వద్దనుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు అంత విలువైన ‘ఐ-పాడ్స్’ ఎమ్మెల్యేలకు ఎందుకు ఇచ్చింది..? ఉద్ధేశం మంచిదైనా.. వాటిని ఎమ్మెల్యేలు సక్రమంగా వినియోగిస్తారా..? అన్నది పాయింట్.