AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్, బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త స్కీమ్స్ ఏంటి..?

తెలంగాణ సర్కార్‌పై ఒక పక్క తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్‌ను, ఇటు.. ప్రజలను దోచేస్తున్నారని.. కామెంట్స్‌ చేస్తోన్న బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త వ్యూహం రచించారా..? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎత్తులు.. చిత్తులు కావడానికి కేసీఆర్‌ కొత్త కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టనున్నారా..! అంటే.. అవుననే అనిపిస్తోంది. గత ఎన్నికల్లో కొత్త పథకాలతోనే.. కేసీఆర్ ప్రజలకు దగ్గరై విజయం సాధించారు. అలాగే.. ఆయన సీఎం అయిన తరువాత.. ఆ పథకాలను 50 శాతం వరకూ.. నెరవేర్చారు కూడా. […]

కాంగ్రెస్, బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త స్కీమ్స్ ఏంటి..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 24, 2019 | 7:45 PM

Share

తెలంగాణ సర్కార్‌పై ఒక పక్క తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్‌ను, ఇటు.. ప్రజలను దోచేస్తున్నారని.. కామెంట్స్‌ చేస్తోన్న బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త వ్యూహం రచించారా..? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎత్తులు.. చిత్తులు కావడానికి కేసీఆర్‌ కొత్త కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టనున్నారా..! అంటే.. అవుననే అనిపిస్తోంది. గత ఎన్నికల్లో కొత్త పథకాలతోనే.. కేసీఆర్ ప్రజలకు దగ్గరై విజయం సాధించారు. అలాగే.. ఆయన సీఎం అయిన తరువాత.. ఆ పథకాలను 50 శాతం వరకూ.. నెరవేర్చారు కూడా. అందుకే ఆయన్ని ప్రజలు మళ్లీ సీఎం చేశారు. అయితే.. కొన్ని కొన్ని పథకాలు నత్తనడకన సాగుతున్నా.. వీలైనంతవరకూ.. ప్రజలకు చేరువవుతోన్నాయి.

అయితే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ పథకాలను మేమే.. ప్రజలకు అందిస్తున్నామని.. కేసీఆర్.. పేరుమార్చి తమవని చెప్పుకుంటున్నారని.. తీవ్రంగా విమర్శలు చేస్తోంది. మేము.. ప్రజలకు అందిస్తున్న పథకాల్లో.. కనీసం 10 శాతం కూడా.. బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అందించడం లేదంటూ.. ఇటీవలే.. మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్‌.. తెలంగాణాను ప్రజలకు ఇచ్చినా కూడా.. వారికి దగ్గర కాలేకపోతోంది. ఇప్పుడు మళ్లీ హుజూర్‌ నగర్‌‌లో బై ఎలక్షన్స్‌ వచ్చిన నేపథ్యంలో.. మళ్లీ కొత్త పథకాల జోరు ఊపందుకున్నాయి.

కేసీఆర్ కొత్త కొత్త పథకాలతో.. ప్రజలను.. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు ప్రాధ్యాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్.. మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఉపాధి అవకాశాలు, కుల వృత్తులకు ప్రత్యేక శిక్షణలు, ప్రొత్సాహకాలు వంటివి కేసీఆర్ కొత్త పథకాలుగా ఉన్నాయి. కానీ.. ఎప్పటినుంచో అమలవుతున్న పాత పథకాలే. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ విజయవంతమైనందున వచ్చే ఏడాదిలో ఫలితాలను సాధించి చూపాల్సిన బాధ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆ దిశగా సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పదునైన ఆలోచనలతో, దూరదృష్టితో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మొదలుకుని కొన్ని మార్పులతో కొత్త పథకాలు కార్య రూపంలోకి రానున్నాయి. నూతన బడ్జెట్ విధానం ప్రకారం.. ప్లాన్, నాన్‌ప్లాన్ స్థానంలో క్యాపిటల్, రెవెన్యూ ఆదాయ, వ్యయాల పద్దతిలో ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అలాగే.. అన్ని శాఖల్లో ప్రతిపాదనలను నిర్వహణ పద్దు, ప్రగతి పద్దుగా విభజించారు. నిర్వహణ, చెల్లింపులు, ప్రగతి పద్దులో సబ్సీడీలు, గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఈ ప్రతిపాదనలలో ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు నిధుల కేటాయింపుల ప్రాధాన్యతలను స్పష్టం చేస్తారు. ఇలా.. కేసీఆర్ కొత్త పథకాలను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!