వివేకానందరెడ్డిని జగన్ రెండు సార్లు కొట్టారు: హర్షకుమార్
రాజమండ్రి: రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డిపై గతంలో జగన్ రెండు సార్లు చేయి చేసుకున్నారంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006లో ఈ సంఘటన జరిగిందని అన్నారు. వివేకానందరెడ్డి మరణంతో సానుభూతి పొందేందుకు జగన్ చూస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. ఇదిలా ఉంటే హర్షకుమార్ ఆదివారం టీడీపీలో చేరనున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలకనున్నారు.