నిద్రమాత్రలు మింగి, కత్తితో కోసుకున్న వైసీపీ ఎమ్మెల్యేై!
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు సునీల్ కుమార్ బలవన్మరణానికి యత్నించారు. నిద్రమాత్రలు మింగి చేతిపై కత్తితో కోసుకున్నారు. దీంతో ఆయన్ను వెంటనే పలమనేరు ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పారు. పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా తనకు మరోమారు అవకాశం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ అన్నంతపనీ చేశారు. కొద్ది రోజుల క్రితమే మూడు తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్ లోటస్ […]
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు సునీల్ కుమార్ బలవన్మరణానికి యత్నించారు. నిద్రమాత్రలు మింగి చేతిపై కత్తితో కోసుకున్నారు. దీంతో ఆయన్ను వెంటనే పలమనేరు ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పారు.
పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా తనకు మరోమారు అవకాశం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించిన డాక్టర్ సునీల్ కుమార్ అన్నంతపనీ చేశారు. కొద్ది రోజుల క్రితమే మూడు తన కుటుంబీకులతో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం వద్ద జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు.
కానీ కుదరక ఆయన్ను కలవకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆపై తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కలకలం రేపారు. ఇప్పుడు అన్నంత పని చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు.