AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో బ్యాటర్లు సమష్టి కృషితో ఛేదించి, కేకేఆర్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించారు.

LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి... కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం
Mukul Choudary
Rakesh
|

Updated on: Apr 09, 2026 | 11:27 PM

Share

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం, ఆయుష్ బదోని మెరుపు ఇన్నింగ్స్ లక్నోకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువ సంచలనం అంగ్‌కృత్ రఘువంశీ (45), కెప్టెన్ అజింక్య రహానే (41) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు మంచి పునాది వేశారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, లక్నో బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్‌ను కట్టడి చేశారు. స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ (4) మరోసారి విఫలమవగా, చివర్లో రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్) ధాటిగా ఆడి గౌరవప్రదమైన స్కోరును అందించారు.

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం అంత సాఫీగా సాగలేదు. వైభవ్ అరోరా తన వరుస ఓవర్లలో ఎయిడెన్ మార్‌క్రమ్ (22), మిచెల్ మార్ష్‌ (15)లను అవుట్ చేసి లక్నోను దెబ్బతీశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (10), నికోలస్ పూరన్ (13) కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో లక్నో కష్టాల్లో పడింది. అయితే ఆయుష్ బదోని (34 బంతుల్లో 54) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆఖర్లో ముకుల్ చౌదరి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.

మ్యాచ్ చివరి దశకు వచ్చేసరికి లక్నోకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ముకుల్ చౌదరి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా, వైభవ్ అరోరా వేసిన ఆ ఓవర్లో ముకుల్ సంయమనంతో ఆడి ఐదో బంతికే విజయాన్ని ఖాయం చేశాడు. ముకుల్ కేవలం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీసినా, చివరి ఓవర్లో ఒత్తిడికి లోనై పరుగులు ఇచ్చేశాడు. ఈ ఓటమితో కేకేఆర్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

Follow Us