AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బారామతి ఉప ఎన్నికలో అనూహ్య పరిణామం.. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్.. సునేత్ర పవార్ ఏకగ్రీవం..!

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో, బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికకు ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే, బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది.

బారామతి ఉప ఎన్నికలో అనూహ్య పరిణామం.. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్.. సునేత్ర పవార్ ఏకగ్రీవం..!
Maharashtra Dy Cm Sunetra Pawar
Balaraju Goud
|

Updated on: Apr 09, 2026 | 5:20 PM

Share

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో, బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికకు ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే, బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంది. శాసనసభ సభ్యురాలిగా సునేత్రా పవార్ ఎన్నిక లాంఛనంగా కానుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సప్కల్‌కు ఫోన్ చేసి, బారామతి నుండి సునేత్ర పవార్‌కు పోటీ లేకుండా జరుగుతున్న ఎన్నికలో తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు. దీంతో హర్ష్ వర్ధన్ సప్కల్ గురువారం (ఏప్రిల్ 09) మధ్యాహ్నం మీడియా సమావేశంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకాష్ మోర్ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయంపై మాట్లాడిన ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

“బారామతిలో ఉప ఎన్నిక ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తన నామినేషన్ గౌరవప్రదంగా ఉపసంహరించుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పవార్ కుటుంబానికి సంఘీభావం చూపింది, బారామతి ప్రజల తరపున దన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని సునీల్ తట్కరే తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ 1991, 1992లో కాంగ్రెస్ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1999 నుండి 2014 వరకు రాష్ట్రంలో డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులను నిర్వహించారని సునీల్ తట్కరే గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి