AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబూ.! బంగారం సంగతి తేల్చండి – విజయసాయి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేదని గతంలోనే చెప్పానని , దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేదన్నారు. టీటీడీ ఈవో నియామకం ఎలా జరిగిందో అందరికీ తెలుసన్న ఆయన.. మన్మోహన్ సింగ్ విచారణ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చెన్నై నుంచి తిరుపతికి వచ్చే బంగారం జాతీయ రహదారిపై కాకుండా.. లోపలి రోడ్డు మీదగా […]

బాబూ.! బంగారం సంగతి తేల్చండి - విజయసాయి
Ravi Kiran
|

Updated on: Apr 24, 2019 | 6:35 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేదని గతంలోనే చెప్పానని , దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేదన్నారు. టీటీడీ ఈవో నియామకం ఎలా జరిగిందో అందరికీ తెలుసన్న ఆయన.. మన్మోహన్ సింగ్ విచారణ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చెన్నై నుంచి తిరుపతికి వచ్చే బంగారం జాతీయ రహదారిపై కాకుండా.. లోపలి రోడ్డు మీదగా ఎందుకు తరలించాల్సి వచ్చిందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఒక ప్రణాళికతో శ్రీవారి ఆస్తుల్ని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. గోవిందరాజుల కిరీటాలు ఎక్కడున్నాయో విచారణ అధికారులకు తెలుసని… చిల్లర దొంగల్ని ఈ కేసులో ఇరికించి చేతులు దులుపుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Follow Us