AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter List Update: 44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ? తెలుసుకోండిలా..!

Voter List Update: ఓటర్లకు ఎన్నికల సంఘం భరోసా ఇస్తోంది. ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని, తమ ఓట్లను సరిచేసుకునేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30 నుండి..

Voter List Update: 44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ? తెలుసుకోండిలా..!
Voter List Update
Subhash Goud
|

Updated on: Jul 25, 2026 | 7:47 PM

Share

Voter List Update: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ‘అన్‌కలెక్టబుల్’ (సేకరించలేనివి) జాబితాలో చేర్చింది. దీంతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవటం తో పాటుగా ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది.

అయితే ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాలో ఈ 44.71 లక్షల ఓట్లు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఎస్‌ఐఆర్‌ ఫామ్‌ను సమర్పించిన వారు తమ ఓటు ఉందోలేదో ఓ సారి చెక్‌ చేసుకోవడం మంచిది.

సరైన ఆధార్‌ లేకపోవడంతోనే..

ఓటర్ల సరైన ఆధారాలు లేకపోవడం, చిరునామాల మార్పు లేదా ఓటర్ల గైర్హాజరీ వంటి కారణాల వల్ల ఈ ఓట్లు తొలగింపునకు గురయ్యాయని అధికారులు వెల్లడిస్తున్నారు. అడ్రస్ మార్పులు, మరణాలు, ఒకటి కంటే ఎక్కువ ఓటరు లిస్ట్‌లో నమోదు అయి ఉండటం, ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అభ్యంతరాల కోసం గడువు

అయితే, ఇదే సమయంలో ఓటర్లకు ఎన్నికల సంఘం భరోసా ఇస్తోంది. ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని, తమ ఓట్లను సరిచేసుకునేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30 నుండి ఆగస్టు 30 వరకు నెల రోజుల పాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఫారమ్-6 ద్వారా తెలిపేందుకు అవకాశం కల్పించారు. అన్ని సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు ఎన్నికల అధికారులు.

SMSతో ఎలా తెలుసువాలి?

  • మీ మొబైల్‌ నుంచి1950 నంబర్‌కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ముందుగా మీ మొబైల్‌లో ECI అని టైప్‌ చేసి స్పెస్‌ ఇచ్చి EPIC Number ఎంటర్‌ చేయండి (ఉదాహారణకు ECI UTQ0777245)
  • SMS పంపిన కాసేపటికే ఈసీ నుంచి మీకు రిప్లై ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.
  • ఇలా మీ మొబైల్‌ నంబర్‌కు మీ పేరు, సీరియల్‌ నెంబర్‌, నియోజకవర్గం పేరు వంటి వివరాలు వచ్చినట్లయితే మీ SIR సక్సెస్‌ అయినట్లే. అయితే ఒక వేళ ప్రాసెస్‌లో ఉంటే మీరు మీ వివరాలు సబ్మిట్‌ చేశారని, త్వరలో నమోదు పూర్తవుతుందని రిప్లై వస్తుంది.

వివరాలు రాకపోతే మీ BLOని సంప్రదించండి. కేవలం SMS రాకపోవడం కారణంగా నమోదు కాలేదని ఖచ్చితమైన ఆధారం కాదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఎపిక్‌ నంబర్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా టైప్‌ చేయాలని, మెసేజ్ పంపిన తర్వాత కాసేపు వేచి ఉండాలని సూచించారు. అయితే, కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా కూడా ఆలస్యంగా సమాధానం రావచ్చని, ఏవైనా సందేహాలు ఉంటే మీ ఏరియా బీఎల్‌వో లేదా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. లేదా ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ?
44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ?
90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు..
90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు..
వానాకాలంలో ఈ తప్పులు చేస్తే పాములు మీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ..
వానాకాలంలో ఈ తప్పులు చేస్తే పాములు మీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ..
ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి..
ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి..
నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌..ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌..ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు
పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు
ఒక గుడ్డు తింటే మీ శరీరానికి అందే పోషకాలు ఇవే..
ఒక గుడ్డు తింటే మీ శరీరానికి అందే పోషకాలు ఇవే..
వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్..
వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్..
ఈ వారం వారి జాతకం మారబోతోంది... ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
ఈ వారం వారి జాతకం మారబోతోంది... ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
ఈ రోజే మంచి రోజు.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట డబ్బుల వర్షమే
ఈ రోజే మంచి రోజు.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట డబ్బుల వర్షమే