AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

వర్షాకాలంలో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ.. మరోవైపు పాములు, క్రిమి కీటకాల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు బిలాల్లోకి, కలుగుల్లోకి చేరడంతో పాములు ఆశ్రయం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో నివాస ప్రాంతాల వైపు, పంట పొలాల వైపు పాముల సంచారం ఎక్కువవుతుంది. వర్షాకాలంలో అనవసర భయాందోళనలకు గురికాకుండా సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు.. పాము కాటు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుతాయి.

Krishna S
|

Updated on: Jul 25, 2026 | 7:40 PM

Share
పాములు ఇంట్లోకి, పరిసరాల్లోకి రాకుండా చూడటానికి ముందుగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్ల కుప్పలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి. అలాగే ఇళ్లలో ఎలుకల సంచారాన్ని అరికట్టడం ద్వారా పాములను నిరోధించవచ్చు. ఎందుకంటే ఆహారం కోసమే పాములు ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇళ్ల తలుపుల కింద ఉండే సందులు, డ్రైనేజీ పైపుల రంధ్రాలను సరిగ్గా మూసివేయడం వల్ల పాములు లోపలికి రాకుండా చూడవచ్చు.

1 / 5
రాత్రి వేళల్లో బయట తిరిగేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళ బయటకు వెళ్లేటప్పుడు లేదా పొలాల వైపు నడిచేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్ ఉపయోగించాలి. నేలపై కాలినడకన వెళ్లేటప్పుడు కర్రతో నేలను తడుతూ లేదా శబ్దం చేస్తూ నడవడం వల్ల పాములు అప్రమత్తమై దూరంగా జరిగిపోతాయి. ఒకవేళ ఇళ్ల పరిసరాల్లో పాము కనిపిస్తే భయంతో కేకలు వేయడం లేదా దాన్ని చంపడానికి ప్రయత్నించడం చేయకూడదు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

2 / 5
అనుకోకుండా ఎవరికైనా పాము కాటు వేస్తే బాధితుడిని ముందుగా మానసికంగా ధైర్యంగా ఉంచడం అత్యంత ప్రధానమైన పని. భయం వల్ల గుండె వేగంగా కొట్టుకుని శరీరంలో విషం వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. కాటు వేసిన చోట అస్సలు కదల్చకుండా స్థిరంగా ఉంచాలి. బాధితుడు ధరించిన ఉంగరాలు, గడియారాలు, గాజులను వెంటనే తీసివేయాలి, ఎందుకంటే వాపు వస్తే అవి కట్టుకుపోయి రక్తప్రసరణను అడ్డుకుంటాయి.

3 / 5
పాము కాటు వేసినప్పుడు చేయకూడని పొరపాట్ల పట్ల కూడా అవగాహన ఉండాలి. గాయాన్ని బ్లేడుతో కోయడం, నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించడం లేదా కాటు వేసిన ప్రాంతానికి పైన తాడుతో దారంతో గట్టిగా కట్టడం వంటి పాత పద్ధతులను అస్సలు చేయకూడదు. నాటు వైద్యం లేదా మంత్రాల వద్దకు వెళ్తూ కాలాన్ని వృథా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

4 / 5
ప్రతి పాము కాటు విషపూరితం కాకపోవచ్చు. కానీ ప్రతి సందర్భాన్ని అత్యవసర పరిస్థితిగానే పరిగణించాలి. కాటు గురైన వ్యక్తిని ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ప్రభుత్వ లేదా నిపుణులు ఉన్న ఆసుపత్రికి తరలించి యాంటీ స్నేక్ వెనమ్ అందించడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..