AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salted Peanuts: 90ల నాటి సినిమా థియేటర్ స్టైల్ ఉప్పు పల్లీలు.. చేసుకుని తింటూ.. తీపి జ్ఞాపకాలను రీలోడ్ చేయండి

90ల కాలంలో థియేటర్లలో సినిమా చూడటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ ఒక తీపి జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది. సినిమా ఇంటర్వెల్‌లో పేపర్ పొట్లాంలో పెట్టి అమ్మే వేడి వేడి ఉప్పు వేరుశెనగ గుండ్లు కొనుక్కుని తింటుంటే ఆ సంతోషమే వేరు. బస్సు ప్రయాణాల్లో, రైల్వే స్టేషన్లలో లభించే ఈ ఉప్పు పల్లీలు ప్రతి ఒక్కరి చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి.

Phani CH
|

Updated on: Jul 25, 2026 | 7:47 PM

Share
నేటి రోజుల్లో స్నాక్స్ రకాలు ఎన్ని మారినా, ఆనాటి వింటేజ్ ఉప్పు పల్లీల రుచికి సాటిరావు. కేవలం వేరుశెనగ గుండ్లు, ఉప్పు మాత్రమే ఉపయోగించి అదే కరకరలాడే రుచితో ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్పు పల్లీల తయారీ వెనుక ఒక చిన్న సాంకేతిక పద్ధతి దాగి ఉంది. ఉప్పు పల్లీలు బయట దొరికేలా కరకరలాడుతూ రావాలంటే ముందుగా మంచి క్వాలిటీ ఉన్న వేరుశెనగ గుండ్లను ఎంచుకోవాలి.

1 / 5
పెద్దవి, చిన్నవి కలిసి ఉన్న లూజ్ పల్లీలను వాడితే వేయించేటప్పుడు కొన్ని వేగి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. అందుకని ఒకే పరిమాణంలో ఉన్న పల్లీలను ఒక కప్పు కుక్కర్‌లో వేసుకోవాలి. అందులోనే రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి మూతపెట్టి హై ఫ్లేమ్‌పై కేవలం రెండు విజిల్స్ రానివ్వాలి.

2 / 5
ఇలా కుక్కర్‌లో ఉడికించడం వల్ల పప్పులోకి తేమ, ఉప్పు సరిగ్గా చేరుతాయి. ఆ తర్వాత నీటిని వడకట్టి పల్లీలను ఒక జల్లెడలో లేదా వస్త్రంపై వేసి 10 నుండి 12 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు లోతుగా ఉన్న బాండీలో అర కప్పు ఉప్పు వేసి వేడి చేయాలి. గాలికి ఆరిన పల్లీలను ఈ ఉప్పులో వేసి సన్నటి మంటపై మాత్రమే ఓపిగ్గా వేయించాలి.

3 / 5
పెద్ద మంట పెడితే పల్లీలు పైన వేగి, లోపల మెత్తగా ఉండిపోతాయి. సిమ్‌లో వేయించడం వల్ల పల్లీలకు పట్టిన ఉప్పు తేమతో కరిగి, తర్వాత పప్పు కణకణంగా వేగుతుంది. సుమారు 30 నుండి 35 నిమిషాలు వేయించిన తర్వాత పల్లీల పొట్టు తేలికగా ఊడిపోవడం, పప్పుపై మెరుపు రావడం గమనించవచ్చు.

4 / 5
ఆ సమయంలో పల్లీలను ఉప్పు నుంచి వడకట్టి జల్లెడలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక పల్లీలు అత్యంత క్రిస్పీగా, పర్‌ఫెక్ట్ సాల్టెడ్ టేస్ట్‌తో సిద్ధమవుతాయి. వర్షం పడుతున్నప్పుడు లేదా సాయంత్రం టీ టైమ్‌లో ఈ ఉప్పు పల్లీలను తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్లముందు మెదులుతాయి.

5 / 5
Follow Us
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?