చర్చలు లేవు.. పరిష్కారం లేదు.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు..!
అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ వేదికగా జరిగిన రెండో విడత ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులను ఒకే తాటిపైకి తీసుకురావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ వేదికగా జరిగిన రెండో విడత ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులను ఒకే తాటిపైకి తీసుకురావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్తాన్ నాయకత్వంతో చర్చలు జరిపినప్పటికీ, అమెరికా ప్రతినిధి బృందంతో నేరుగా కలవడానికి నిరాకరించారు. అమెరికా నౌకాదళం విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడమే తమ ప్రధాన షరత్తు అని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల్లో పురోగతి లేకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌ల పాకిస్తాన్ పర్యటనను రద్దు చేశారు. “18 గంటల ప్రయాణం వృథా అని, ఇరాన్ నాయకత్వంలో స్పష్టత లేదని” ట్రంప్ విమర్శించారు. చర్చలు జరపాలంటే తమకే ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు.

Trump Twitt
ఇస్లామాబాద్‌లో భారీ భద్రత మధ్య ఈ భేటీలు జరిగినప్పటికీ, ఇరు పక్షాల మధ్య కనీసం పరోక్ష సంభాషణ కూడా సజావుగా సాగలేదు. ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పాకిస్తాన్‌కు అందజేసి, అక్కడి నుండి ఒమన్‌కు బయలుదేరింది. ఈ వైఫల్యం మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్లిష్టతను మరోసారి చాటిచెప్పింది. పాకిస్తాన్ తనను తాను ఒక శక్తివంతమైన మధ్యవర్తిగా నిరూపించుకోవాలని ప్రయత్నించినప్పటికీ, అమెరికా – ఇరాన్‌ల మధ్య ఉన్న విభేదాలను తొలగించలేకపోయింది. అరాఘ్చి ఇప్పుడు రష్యా – ఒమన్‌ల వైపు మొగ్గు చూపుతుండటం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Very fruitful visit to Pakistan, whose good offices and brotherly efforts to bring back peace to our region we very much value.
Shared Iran's position concerning workable framework to permanently end the war on Iran. Have yet to see if the U.S. is truly serious about diplomacy.
— Seyed Abbas Araghchi (@araghchi) April 25, 2026
ప్రస్తుతానికి ఇరు దేశాలు ఘర్షణలకు దూరంగా ఉంటామని ప్రకటించినప్పటికీ, ఆంక్షల తొలగింపు, సముద్ర దిగ్బంధనం వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రాంతంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దౌత్య మార్గాలు తెరిచి ఉన్నాయని చెబుతున్నా, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
