మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అడుగులు వేస్తుంటే... ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసింది గులాబీ దళం. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంపై ఆగ్రహంగా ఉంది. టెక్నికల్‌గా ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉన్న ఆయన కాషాయ పార్టీ పెద్దలతో మంతనాలపై TRS అధినేత చాలా సీరియస్‌గా ఉన్నారు. ఏ క్షణమైనా రాజేందర్‌పై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది.