సాగుతున్న రగడ …..మమతా బెనర్జీవన్నీ అబద్దాలు…., ప్రధాని నుంచి ఆమె ఏ అనుమతిని తీసుకోలేదు…కేంద్రం వెల్లడి
యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాలేనని తాను ముందే అనుమతి తీసుకున్నానంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనను కేంద్రం ఖండించింది.
యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాలేనని తాను ముందే అనుమతి తీసుకున్నానంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనను కేంద్రం ఖండించింది. అసలు ఆమెకు మోదీ ఎలాంటి అనుమతిని ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని కోసం తను అరగంట సేపు వేచి చూశానన్న ఆమె వ్యాఖ్యలు కూడా సరి కావని, నిజానికి మోదీయే ఆమెకోసం కొంతసేపు వెయిట్ చేశారని ఈవర్గాలు వెల్లడించాయి. ఇలా ఉండగా ఈ వ్యవహారంలో గవర్నర్ జగదీప్ ధన్ కర్ కూడా తలదూర్చారు. సమీక్షా సమావేశంలో ప్రతిపక్ష నేత సువెందు అధికారి పాల్గొంటే తాను ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తానని మమత ముందే హెచ్చరించారని ఆయన ట్వీట్ చేయగా..దాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఖండించారు. మమతా బెనర్జీ ప్రజాసంక్షేమం కోసం వారంలో 24 గంటలూ పని చేసే వ్యక్తి అని, ఆమె విషయంలో మీరిలా జోక్యం చేసుకోవడం తగదని వారు అన్నారు. మరోవైపు మాజీ చీఫ్ సెక్రటరీ బందోపాధ్యాయ విషయంలో కూడా కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఇంకా రాజకీయ రగడ కొనసాగుతోంది. ఆయనను కేంద్రానికి పంపే ప్రసక్తి లేదంటూ అయన చేత రాజీనామా చేయించి తన ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మమత నియమించుకోవడం..మరోవైపు ఆయనకు కేంద్రం సంజాయిషీ నోటీసు పంపడం తెలిసిందే.
అసలు ఆలిండియా సర్వీసెస్ రూల్స్ లోని 7 వ నిబంధన ప్రకారం ఓ ఐఏఎస్ అధికారి కేంద్రం ఆదేశాలకు తలొగ్గకపోయినా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేయలేకపోయినా కేంద్రం అలాంటి అధికారిపై ఏ విధమైన చర్యనూ తీసుకోజాలదు. అసలు సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలా ..వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఈ రూల్ నిర్దేశిస్తోంది. బందోపాధ్యాయ కేసులో ఆయనను రీకాల్ చేయాలన్న కేంద్రం సూచనను మమత తిరస్కరించారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే విషాద సంఘటన..!సమ్మక్క సారక్క పూజారిదంపతుల మృతి.కారణం తెలుసా..?:Sammakka Sarakka
ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.