బీజేపీలోకి టీఆర్ఎస్ నేత

అధికార పార్టీ టీఆర్ఎస్‌కు పెద్ద షాకే తగిలింది. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 29న ప్రధాని మోడీ సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోవడంతో పార్టీపై జితేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. టికెట్ రాకపోయినా తాను పార్టీలోనే ఉంటానని ఇప్పటికే జితేందర్ ప్రకటించారు. అయితే.. బీజేపీ నేత రాంమాధవ్ జితేందర్ రెడ్డితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ బీజేపీలో చేరేందుకు జితేందర్ […]

  • Updated On - 2:34 pm, Tue, 26 March 19 Edited By:
బీజేపీలోకి టీఆర్ఎస్ నేత

అధికార పార్టీ టీఆర్ఎస్‌కు పెద్ద షాకే తగిలింది. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 29న ప్రధాని మోడీ సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోవడంతో పార్టీపై జితేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. టికెట్ రాకపోయినా తాను పార్టీలోనే ఉంటానని ఇప్పటికే జితేందర్ ప్రకటించారు. అయితే.. బీజేపీ నేత రాంమాధవ్ జితేందర్ రెడ్డితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ బీజేపీలో చేరేందుకు జితేందర్ రెడ్డి కండీషన్స్ పెట్టినట్లు.. ఇందుకు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.