Nagarjuna Sagar bypoll: ఈ రోజే సాగర్‌ నామినేషన్లకు ఫైనల్‌ డే.. నామినేషన్లు వేయనున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు..

ఈ రోజే ఫైనల్‌ డే. సాగర్‌ నామినేషన్లకు ఈ రోజే చివరిరోజు. టీఆర్‌ఎస్‌, బీజేపీ క్యాండేట్ల‌ సస్పెన్స్‌ వీడింది. టీఆర్‌ఎస్‌ భగత్‌ని అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని గంటలకే... డాక్టర్‌ రవికుమార్‌ పేరును ఎనౌన్స్‌ చేసింది బీజేపీ. సాగర్‌ బరిలో మూడు..

Nagarjuna Sagar bypoll: ఈ రోజే సాగర్‌ నామినేషన్లకు ఫైనల్‌ డే.. నామినేషన్లు వేయనున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు..
Nagarjuna Sagar Bypoll
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 30, 2021 | 8:49 AM

Nominations Today: ఈ రోజే ఫైనల్‌ డే. సాగర్‌ నామినేషన్లకు ఈ రోజే చివరిరోజు. టీఆర్‌ఎస్‌, బీజేపీ క్యాండేట్ల‌ సస్పెన్స్‌ వీడింది. టీఆర్‌ఎస్‌ భగత్‌ని అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని గంటలకే… డాక్టర్‌ రవికుమార్‌ పేరును ఎనౌన్స్‌ చేసింది బీజేపీ. సాగర్‌ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌కు రెడీ అయ్యారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడు తుది గడువు కావడం వల్ల.. ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా ఇతరులూ పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌తోపాటు… అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు.. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ముందు వరుసలో నిలిస్తే.. టీఆర్ఎస్, బీజేపీ మాత్రం నామినేషన్ల తుది గడువుకు ముందు రోజు మాత్రమే అభ్యర్థిత్వాలను ప్రకటించాయి. కాంగ్రెస్​నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ నాయక్ సహా… వివిధ పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ముగ్గురూ గంట వ్యవధిలో.. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఉదయం 11 గంటలకు నామినేషన్ అందజేయనుండగా… మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్ రెడ్డి హాజరు కానున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేస్తారని.. పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీలో అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొన్న దృష్ట్యా చివరకు టికెట్ దక్కించుకున్న రవికుమార్ నాయక్.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి…

వ్యూహాత్మకంగా చివరిదాకా అభ్యర్థిని ప్రకటించలేదు టీఆర్‌ఎస్‌. నోముల భగత్‌తో పాటు టికెట్‌కోసం పోటీపడ్డ కోటిరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ భవన్‌కి రావటంతో చివరిదాకా టికెట్‌ ఎవరికనే ఉత్కంఠ కొనసాగింది. చివరికి సామాజిక సమీకరణాలకు తోడు…సెంటిమెంట్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని నోముల కుమారుడికే అవకాశమిచ్చింది టీఆర్‌ఎస్‌. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత హామీ ఇచ్చారు. సాగర్‌లో భగత్‌ విజయానికి సహకరించాలని సూచించారు.

విద్యావంతుడు కావడం, తండ్రికోసం పనిచేసే క్రమంలో క్షేత్రస్థాయిలో పరిచయాలుండటంతో ఈజీగా గెలుపు గుర్రమెక్కుతారనే ధీమాతో ఉంది గులాబీపార్టీ. నిడమనూరులో మంగళవారం నామినేషన్‌ వేయబోతున్నారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భగత్‌..నేతలంతా తనకు సహకరిస్తారనే ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

ఇప్పటికే హాలియాసభతో ప్రచారాన్ని ఉధృతం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి మంగళవారం నామినేషన్‌ వేయబోతున్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే టీపీసీసీ ముఖ్యనేతలు ప్రచారంలో జానాకి తోడవ్వబోతున్నారు.

బీజేపీ అభ్యర్థి..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించేదాకా వ్యూహాత్మకంగా వేచిచూసింది బీజేపీ. డాక్టర్‌ పనుగోతు రవికుమార్‌ని సాగర్‌ అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్‌పై నమ్మకంతో ముందే నామినేషన్‌ వేశారు కంకణాల నివేదిత. ఆమెతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా టికెట్‌కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. రవికుమార్‌ నామినేషన్‌ పూర్తయ్యాక.. టికెట్‌ ఆశించిన నేతల్ని బుజ్జగించబోతున్నారు కమలంపార్టీ నేతలు.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?