AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న అభ్యర్థులు.. ఆ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ ప్రచారం

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. గెలుపే లక్ష్యంగా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న అభ్యర్థులు.. ఆ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ ప్రచారం
K Sammaiah
|

Updated on: Feb 24, 2021 | 3:15 PM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. గెలుపే లక్ష్యంగా పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల ప్రచారం పోటాపోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లాకు ధీటుగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు.

జనగాం జిల్లాలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని బచ్చన్నపేట, జనగామ, రఘునాథపల్లి మండలాల్లో అయన పలు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు, పట్టబద్రులైన నిరుద్యోగులను కలిసి ఓటును అభ్యర్థించారు. జనగామ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఉపాద్యాయులను, లెక్చరర్స్ ను ప్రత్యక్ష్యంగా కలిశారు.

జనగాం జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంతరెడ్డితో కలిసి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులకు, అధ్యాపకులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మార్పు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు, పిఆర్సీ వంటి సమస్యలను పెండింగ్‌లో పెట్టిన టీఆర్‌ఎస్‌కు బుద్ది రావాలంటే బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read more:

మంత్రి ఎర్రబెల్లితో కవిత సహా ఎమ్మెల్సీల భేటీ.. మంత్రికిచ్చిన వినతిపత్రంలో ఏముందంటే..