సంస్కారంతో నమస్కారం పెట్టినా పెద్ద దుమారం.. ఆలింగనం చేసుకుంటే అంతే సంగతులు!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్... వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారంటూ గత రెండ్రోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రోలర్స్ పేట్రేగిపోతున్నారు. దీంతో ఇష్యూపై ఇటు కొండపల్లి శ్రీనివాస్ అటు బొత్స సత్యనారాయణ ఇద్దరూ స్పందించారు. ఇక ఆ మధ్య మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఏపీలో రచ్చ లేపింది..
ఒకరికొకరు కంటపడ్డారా కనికరిస్తామేమో..! చెయ్యి కలిపారో చెడుగుడేనప్పా. కాదు కూడదు.. సరదాగా మాట్లాడుకుంటాం, ఆలింగనాల వరకూ వెళ్తామంటే.. నా సామిరంగ అస్సల్ కథ వేరే ఉంటది. పార్టీలు మారుతున్నారు. జెండా ఎత్తేస్తున్నారు. అందుకే కలుస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తున్నారంటూ 70MMలో సిన్మా చూపిస్తాం. రచ్చరచ్చ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంది ఏపీలో పరిస్థితి. అధికార విపక్ష నేతలు కలిసినా… మాట్లాడుకున్నా వేరే లెవల్ నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అప్పటి పవన్-బొత్స ఆలింగనం నుంచి లేటెస్ట్ కొండపల్లి-బొత్స నమస్కారం వరకూ ఇదే జరిగింది…! కలిస్తే.. ఖల్లాసే అన్నట్లుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్ష నేతల మధ్య కలయిక వేరే లెవల్ పొలిటికల్ సిన్మా చూపిస్తోంది. అనుకోకుండా ఎక్కడైనా కలిసినా, కలిసి చెయ్యి కలిపినా, ఆత్మీయ ఆలింగం చేసుకున్నా… నెక్ట్స్ డే వేరే లెవల్ పబ్లిసిటీ జరుగుతోంది. పార్టీ జంప్ లేదంటే పర్సనల్ బెనిఫిట్స్ కోసం కలిశారంటూ ప్రచారం హోరెత్తుతోంది. సోషల్ మీడియాలో అయితే మూడు పోస్టులు ఆరు లైకులు అన్నట్లుగా పండగ వాతావరం కనిపిస్తోంది. ఇక ట్రోలర్స్‌కు ఫుల్ మీల్స్ అన్నట్లే.
ఇంకిప్పుడు నమస్తే పెడితే కాళ్లు పట్టుకున్నారన్న ప్రచారం లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతోంది. యస్… మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కనిపించగానే లేచి కాళ్లు పట్టుకున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. రెండ్రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండపల్లి స్పందించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు కొండపల్లి శ్రీనివాస్. సంస్కారంతో నమస్కారం పెట్టానంటున్నారు. కొత్త నాయకత్వాన్ని బలహీనపరిచేందుకే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
ఇటు బొత్స సత్యనారాయణ కూడా ఇష్యూపై రియాక్టయ్యారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని… కొండలపల్లి శ్రీనివాస్‌ను బలి చేస్తున్నారన్నారు. ఇక ఆ మధ్య పవన్- బొత్స పలకరింపులపైనా ఇలాంటి వ్యవహారమే నడిచింది. అసెంబ్లీ ప్రాంగంణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఒకరికొకరు ఎదరుపడ్డారు. ఒకరుకొకరు ఎదురెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని… ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నమస్కారం పెట్టుకుని వెళ్లిపోయారు. ఇక ఆ సీన్ బయటకొచ్చిందో లేదో… ఫుల్ ట్రెండ్ అయ్యింది. పవన్‌కి షేక్ హ్యాండిచ్చిన బొత్స… వైసీపీకి కూడా హ్యాండ్ ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. జనసేనలోకి మరికొన్ని రోజుల్లోనే బొత్స జంప్ అవుతున్నారు… అందుకే కనపడగానే కనిసిపోయారంటూ ప్రచారం పీక్స్‌కి చేరింది.
ఈ మధ్య మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఏపీలో రచ్చ లేపింది. ఇద్దరూ కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడంపై ఇటు వైసీపీ…అటు కూటమి ప్రభుత్వంలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వ కార్యక్రమంలో జోగి రమేష్ ఎలా పాల్గొంటారంటూ ప్రభుత్వ పెద్దలు పార్థసారధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే… ఇటు వైసీపీ నుంచి జంప్ అవుతున్నారన్న ప్రచారంపై జోగి రమేష్‌ను అధిష్టానం అడిగినట్లు తెలుస్తోంది. ఇక పై రెండు ఇష్యూస్ సోషల్ మీడియా ప్రచారమైతే… జోగి-పార్ధసారధి ఎపిసోడ్‌పై నేతలే విమర్శలు గుప్పిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే జోగి రమేష్ కార్యక్రమానికి వచ్చేంతవరకు తనకు తెలియదని.. ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన్ను చూసి షాక్ అయ్యానంటూ టీడీపీ అధిష్టానానికి పార్ధసారధి క్లారిటీ ఇచ్చారు.
మొత్తంగా… అధికార, విపక్ష నేతలు పొరపాటున కలిసినా… మర్యాదపూర్వకంగా చేయి కలిపినా నెగిటివ్ ప్రచారం ఓరేంజ్‌లో నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..