AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు.

ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం!
Telangana Rising 2047 Vision Document
Balaraju Goud
|

Updated on: Dec 06, 2025 | 7:58 AM

Share

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్‌ నిర్వహించనున్నారు. మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు.

అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ రైజింగ్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్‌ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుస్తామంటోంది.

సమ్మిట్‌లో మొత్తం 26 ప్రత్యేక సెషన్లు ఉంటాయి టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు జరుగుతాయి. 75 మంది ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు .198 మంది టెక్నాలజీ రంగ ప్రతినిధులు, 66 మంది హెల్త్‌కేర్ ఫార్మా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో కిరణ్ మజుందార్ షా , పి.వి.సింధు, రితేశ్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి, సతీష్ రెడ్డి, అర్వింద్ సుబ్రహ్మణియన్, రాజత్ గుప్తా, BVR సుబ్రహ్మణ్యం ప్రసంగించనున్నారు.

టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేయనుంది ప్రభుత్వం. టెక్ డెలిగేట్లు, బ్యాంకింగ్ & ఫైనాన్స్ ప్రతినిధులు పాల్గొననున్నారు. సెమీకండక్టర్, GCC విస్తరణపై కీలక చర్చలు జరుగుతాయి. జీనోమ్ వ్యాలీ పవర్‌ ఏంటో ప్రపంచ దేశాలకు చూయించనుంది ప్రభుత్వం. ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం , PPP మోడల్స్, ఫైనాన్షియల్ హబ్ అవకాశాలను వివరించనుంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్‌ లో సెమీకండక్టర్ భాగస్వామ్యాల ఫైనలైజేషన్, 9CC విస్తరణ ఒప్పందాలు, ఇండో – పసిఫిక్ ట్రేడ్ బలోపేతం. పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి సారించనున్నారు.

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు సమ్మిట్‌లో పాల్గొననున్నాయి. ఈ సమ్మిట్‌తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..