AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly Elections 2023: తుది దశకు టిక్కెట్ల కేటాయింపు..! అసంతృప్తులకు చెక్​పెట్టేలా వ్యూహం మార్చిన హస్తం పార్టీ..!

తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్‌ వెలువడినా ఇంకా జాబితా రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దీనికి తోడు టికెట్ల కోసం ఆశావహుల నుంచి వస్తోన్న డిమాండ్లతో టీపీసీసీ ఉక్కిరిబిక్కిరౌతోంది.ఎమ్మెల్యే అభ్యర్తుల ఖరారులో జరుగుతోన్న జాప్యం.. పొత్తుల విషయంలో కాంగ్రెస్​అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న ఆ పార్టీ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023: తుది దశకు టిక్కెట్ల కేటాయింపు..! అసంతృప్తులకు చెక్​పెట్టేలా వ్యూహం మార్చిన హస్తం పార్టీ..!
Telangana Congress
Balaraju Goud
|

Updated on: Oct 12, 2023 | 3:00 PM

Share

తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్‌ వెలువడినా ఇంకా జాబితా రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దీనికి తోడు టికెట్ల కోసం ఆశావహుల నుంచి వస్తోన్న డిమాండ్లతో టీపీసీసీ ఉక్కిరిబిక్కిరౌతోంది.ఎమ్మెల్యే అభ్యర్తుల ఖరారులో జరుగుతోన్న జాప్యం.. పొత్తుల విషయంలో కాంగ్రెస్​అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న ఆ పార్టీ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఒక వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మరోవైపు మంత్రి హరీశ్ రావు.. చెరో దిక్కు సుడిగాలి పర్యనలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయబోయే అభ్యర్థులెవరనేది ఇంకా తేలకపోవడంతో ఆశావహుల్లో గుబులు మొదలైంది. 119 నియోజకవర్గాలకు గానూ డిమాండ్‌ ఊహించని స్థాయిలో ఉండటంతో సర్దుబాటు చేయడం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి సవాలుగా మారింది.

కులాల ప్రాతిపదికగా టిక్కెట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలంటూ రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బీసీ నేతలు తమకు 34 నియోజకవర్గాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహిళా కాంగ్రెస నాయకులు 25 సీట్లడుగుతున్నారు. కమ్మ జేఏసీ 10 సీట్లకు పట్టుబడుతోంది. ఓయూ విద్యార్థి జేఏసీ 11 స్థానాలు కేటాయించాలంటోంది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న తొమ్మిది కుటుంబాల నేతలు 18 సీట్లు డిమాండ్‌ చేస్తున్నారు. సకుటుంబసమేతంగా టికెట్లు ఆశిస్తున్న జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దంపతులు, కొండా దంపతులు, దామోదర్‌ రాజనరసింహ, సీతక్క, అంజన్‌కుమార్ యాదవ్, మైనంపాటి హన్మంతరావు తదితరులకు ఎలాగైనా టికెట్లు సర్దుబాటు చేయాల్సిందే.

టికెట్ల కేటాంపు అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కాలోనన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం మేథోమథనం చేస్తోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పక్షం రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించాలని ముందుగా భావించింది ఏఐసీసీ. అన్ని వర్గాల నుంచి సమాన ప్రాతిపాదికన టిక్కెట్ల డిమాండ్ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో టీపీసీసీ సీనియర్లతో ఇప్పటికే అనేక మార్లు భేటీ అయిన అగ్రనేతలు టిక్కెట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. ముందుగా 30 మందితో తొలి జాబితా ప్రకటించాలని భావించిన అధిష్టానం.. తర్వాత 60 మంది, 70 మందితో కూడిన జాబితాను సిద్దం చేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో నెలకొన్న డిమాండ్‌తో ఇక నేరుగా 119 సెగ్మెంట్లకు అభ్యర్ధులను ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ నెలా మూడో వారంలో ప్రారంభంకానున్న బస్సుయాత్ర తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తోంది.

అయితే ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం కుటుంబంలో ఒకరికే ఇస్తారా లేక గెలుపు అవకాశాలనుబట్టి ఇద్దరిద్దరికి ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. దీనికి తోడు కమ్యూనిస్టులు కూడా టికెట్లు కోరుతున్నారు. దీనికి తోడు అటు ఢిల్లీలోనూ, ఇటు గాంధీభవన్‌ దగ్గర ప్రతిరోజూ టికెట్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా గిరిజన నాయకులు కూగా గాంధీభవన్‌ వద్ద నిరసనలకు దిగారు. నాగం జనార్ధన్‌ రెడ్డి వర్గీయులు నాగర్‌ కర్నూల్ టికెట్ కోసం పట్టుబట్టారు. పరిస్థితి ఇలా ఉంటే అభ్యర్థుల విడుదలపై కాంగ్రెస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తుల విషయం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు టికెట్ల కేటాయింపుపై మీడియాలో వస్తున్న కథనాలతో కూడా కాంగ్రెస్‌ నేతలు కలవరపడుతున్నారు. పెద్దలు ఎంత సర్ది చెప్పాలని చూసినా జాబితా ఆలస్యం అయ్యే కొద్దీ కాంగ్రెస్‌ ఆశావహుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుతోంది. ఇదిలావుంటే సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామంటున్నారు అధిష్టానం ముఖ్యనేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి