ఎస్పీవై రెడ్డితో టీడీపీ నేతల సంప్రదింపులు

నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు. ఫ్యామిలీతో పాటు ఆయన్ను ఎన్నికల పోటీ నుంచి విత్ డ్రా చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేగా అల్లుడు శ్రీధర్ రెడ్డి, బనగానపల్లి శ్రీశైలం నుంచి ఇద్దరు కుమార్తెలు […]

  • Updated On - 11:23 am, Tue, 26 March 19 Edited By:
ఎస్పీవై రెడ్డితో టీడీపీ నేతల సంప్రదింపులు

నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డిని బుజ్జగిస్తున్నారు టీడీపీ నేతలు. ఫ్యామిలీతో పాటు ఆయన్ను ఎన్నికల పోటీ నుంచి విత్ డ్రా చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేగా అల్లుడు శ్రీధర్ రెడ్డి, బనగానపల్లి శ్రీశైలం నుంచి ఇద్దరు కుమార్తెలు రాణి, సుజల పోటీకి దిగారు. అందరూ జనసేన తరపున నామినేషన్లు వేశారు. అయితే.. వీరిని మళ్లీ తమ గూటికి చేర్చుకోవాలని టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.